బ్యాంకులో రూ. లక్ష దోచిన మహిళ.. కెమెరాకు చిక్కింది
పశ్చిమగోదావరి: ఓ బ్యాంకులో చేతివాటం ప్రదర్శించిన మహిళ క్షణాల్లోనే దొరికిపోయింది. దొంగతనం చేయడంలో చేయితిరిగినప్పటికీ.. ఆ మహిళ బ్యాంకు సిసి కెమెరాల నుంచి తప్పించుకోలేకపోయింది. బ్యాంకులో నగదు డ్రా చేసుకున్న ఓ వ్యక్తి నుంచి రూ. లక్షను కాజేసిన మహిళను బ్యాంకు అధికారులు సిసి కెమెరాల సహాయంతో క్షణాల్లోనే పట్టేశారు.
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండిలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా డబ్బు కొట్టేసుకుని వెళ్లిన మహిళను సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల పక్కా సమాచారంతో ఆ మహిళా అరెస్ట్ చేసేందుకు పోలీసులు బయలుదేరారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.
విద్యుత్ షాక్‌తో ఉద్యోగిని మృతి
రంగారెడ్డి: ఓ ప్రైవేటు కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న సరిత (38) ఆదివారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి బాత్రూమ్‌లో వాటర్ హీటర్ పెడుతుండగా ఆమె విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications