ఆస్తి కోసం .. ఇద్దరు తమ్ముళ్ళను రాళ్ళతో కొట్టి కాలువలో పడేసి ..అనంతపురంలో దారుణం
అనంతపురం జిల్లాలో ఓ యువకుడికి దుర్బుద్ధి పుట్టింది. బాబాయ్ ఇద్దరు కొడుకులను చంపేస్తే బాబాయ్ ఆస్తి కూడా తనకే వస్తుందని భావించిన ఓ యువకుడు అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను, అందులోనూ బాబాయ్ కొడుకులను హతమార్చేందుకు ప్రయత్నం చేశాడు. గార్లదిన్నె మండలం మార్తాడుకు చెందిన రాము తన తమ్ముళ్ళు అని కూడా చూడకుండా ఆస్తి కోసం వారిని కిరాతకంగా చంపే ప్రయత్నం చేశాడు.

బాబాయి కొడుకులను చంపే యత్నం చేసిన అన్న కొడుకు
చిన్నాన్న కొడుకులైన శశిధర్, మోక్షజ్ఞ లు ఇంటిముందు ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి నమ్మబలికిన రాము వారిని బయటకు తీసుకు వెళ్ళాడు. ఆపై వారిని దారుణంగా హతమార్చడానికి ప్రయత్నించాడు. ఆడుకోడానికి వెళ్ళిన పిల్లలు ఇంటికి ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానంతో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాము పై అనుమానంతో ప్రశ్నించగా బాబాయ్ కొడుకులను తానే తీసుకెళ్లినట్లు ఒప్పుకున్న రాము అతను చేసిన ఘాతుకాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

ప్రాణాపాయంలో ఒక బాలుడు ,ఇంకో బాలుడి కోసం గాలింపు
చాక్లెట్లు కొనిస్తానని బయటకు తీసుకు వెళ్లిన రాము బాబాయి కొడుకులను రాళ్లతో కొట్టి కాలువలో పడేసినట్లుగా చెప్పినట్టు సమాచారం . కూడేరు సమీపంలో శశిధర్ ప్రాణాపాయ స్థితిలో కనిపించగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . ఇప్పటి వరకు మోక్షజ్ఞ జాడ తెలియలేదు. మోక్షజ్ఞ ను హంద్రీ-నీవా కాలువలో పడేసిన ట్లుగా రాము ఒప్పుకున్నాడని సమాచారం . ప్రస్తుతం మోక్షజ్ఞ కోసం పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.
Recommended Video

ఆస్తి కోసమే దారుణం .. కేసు నమోదు చేసిన పోలీసులు
ఆస్తి కోసం అన్న కొడుకు చేసిన ఘాతుకాన్ని తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. చిన్నాన్న ఇద్దరు కొడుకులు చనిపోతే, చిన్నాన్న వాటా కింద ఉన్న 10 ఎకరాల పొలం కూడా తనకే వస్తుందని ఆశతో రాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు రాముని అదుపులోకి తీసుకొని ఈ కేసును విచారిస్తున్నారు . అయితే ఈ కేసులో కేవలం ఆస్తి కోసమే రాము ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా ? లేదా మరేదైనా కారణం ఉందా ? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications