ఇసుక స్కామ్, మైనింగ్ శాఖ మాజీ ఎండీని పట్టుకున్న ఏసీబీ, పెద్దిరెడ్డికి ?

ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో పట్టుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పలువురు ఇసుక కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేయడానికి వెంకటరెడ్డి పూర్తిగా సహకరించాడని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డి నిర్లక్ష్యం కారణంగా సుమారు రూ. 2,500 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ గనుల శాఖలో లీజు అక్రమాలు, అక్రమ ఇసుక తవ్వకాలకు వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి ఏ1 నిందితుడు అని ఏసీబీ అకారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈనెల 11వ తేదీన ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు.

ACB officials arrested former MD of Andhra Pradesh Mines Department Venkata Reddy

అప్పటినుండి వెంకటరెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలోని గెస్ట్ హౌస్ ఖాళీ చేసుకుని ఎవరికి చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే మాయం ఆయన వెంకటరెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, ముంబాయి, చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు గాలించారు. వెంకటరెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.

ఆ రోజు నుండి ఏసీబీ అధికారుల వెంకటరెడ్డి కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే హైదరాబాదులోనే వెంకటరెడ్డి తలదాచుకున్నాడని ఏసీబీ అధికారులకు పక్కా సమాచారం అందడంతో గురువారం రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి వెంకటరెడ్డిని పిలుచుకొని వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖలో జరిగిన అక్రమాలపై నమోదైన కేసుల ఏ1 నిందితుడైన వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.

ACB officials arrested former MD of Andhra Pradesh Mines Department Venkata Reddy

ఈ కేసులో మిగిలిన ఏడు మంది నిందితులను విచారించడానికి ఏసీబీ అధికారులు సిద్ధం అవుతున్నారు. గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు వెంకటరెడ్డి వీర విధేయుడిగా మారాడని, అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు విన్నాడని వెంకటరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద వెంకటరెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కడంతో ఆంధ్రప్రదేశ్ గనుల శాఖలో జరిగిన అక్రమాలు మొత్తం బయటకు వస్తాయని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+