ఘోర ప్రమాదం: టెంపో-ఆర్టీసీ బస్సు ఢీ, ఐదుగురు మృతి

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: జిల్లాలోని బంగారుపాలెం మండలం కేజీ సత్రం వద్ద బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. టెంపోను కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Accident in KG Satram: 5 killed

ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది వరకు ఉన్నట్టు సమాచారం. బాధితులను మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల నుంచి మైసూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
5 persons killed in Raod accident held in Chittoor district on Wednesday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి