వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికెన్ బాగోలేదని ఘర్షణ; వేములవాడలో చికెన్ వ్యాపారితో పాటు పదిమందిపై యాసిడ్ దాడి

|
Google Oneindia TeluguNews

ఇటీవల కాలంలో గొడవలకు పెద్ద కారణాలు అవసరం లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకునే దాకా తెగ బడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమాజంలో పెరిగిన నేర ప్రవృత్తి అందుకు కారణంగా కనిపిస్తుంది. కేవలం వ్యాపారి విక్రయించిన చికెన్ బాగోలేదని జరిగిన గొడవ అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురి చేస్తుంది.

 చికెన్ బాగోలేదని వ్యాపారితో గొడవ

చికెన్ బాగోలేదని వ్యాపారితో గొడవ

ఒక చికెన్ వ్యాపారి మంచి చికెన్ విక్రయించటం లేదని జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ ఘర్షణ కాస్త చివరకు సదరు వ్యాపారి తో పాటు, మరో పది మంది పై యాసిడ్ దాడికి గురయ్యేలా చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే వేములవాడ రాజన్న ఆలయంలో చిరు వ్యాపారాలు చేసుకునే కొందరు తిప్పాపూర్ లో చికెన్ కొనుగోలు చేశారు. అయితే వారు కొనుగోలు చేసిన చికెన్ బాగోలేదని వ్యాపారితో వాళ్లు గొడవకు దిగారు.

 చికెన్ షాపు వ్యాపారిపై, అతనికి మద్దతుగా వచ్చిన వారిపై యాసిడ్ దాడి

చికెన్ షాపు వ్యాపారిపై, అతనికి మద్దతుగా వచ్చిన వారిపై యాసిడ్ దాడి

చికెన్ షాప్ వ్యాపారి మైలారపు హరీష్ మంచి మాంసాన్ని విక్రయించటం లేదన్న కోపంతో చిరు వ్యాపారాలు చేసే వారంతా అతనిపై దాడికి దిగారు. గురువారం రాత్రి సమయంలో వారి మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. కర్రలు, రాళ్లతో మొదట మొదలైన ఘర్షణ చివరకు యాసిడ్ దాడి వరకు వెళ్ళింది. చిరు వ్యాపారులు చికెన్ షాప్ వ్యాపారి పైన, అతనికి మద్దతుగా వచ్చిన కొందరిపైనా యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఒకరి పరిస్థితి విషమం... కేసు నమోదు చేసిన పోలీసులు

ఒకరి పరిస్థితి విషమం... కేసు నమోదు చేసిన పోలీసులు

అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాసిడ్ దాడిలో గాయపడిన వారందరినీ కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై స్థానికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయ ప్రాంతంలో ఉండే చిరు వ్యాపారులే దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనకు చికెన్ బాగోక పోవడమే కారణమా ? లేక మరేమైనా కారణాలున్నాయా అన్నది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యాసిడ్ దాడికి కారణం చికెన్ మంచిది కాదనేనా? లేకా మరేదైనానా?

యాసిడ్ దాడికి కారణం చికెన్ మంచిది కాదనేనా? లేకా మరేదైనానా?


ఈ ఘటనలో గాయపడిన వారి వద్ద నుండి సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసులు ఘటనకు బాధ్యులను అరెస్టు చేసే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా మంచి చికెన్ విక్రయించే లేదన్న కారణంతో చిరువ్యాపారులు ఇంతగా యాసిడ్ దాడికి పాల్పడ్డారు అన్న విషయం నమ్మశక్యంగా లేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

English summary
In Vemulawada, some street vendors started arguing that the chicken sold by a chicken trader was not good. The clash became serious and ten people, including a chicken trader, were attacked with acid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X