అత్తారింటికి మంచు మనోజ్- ఆళ్లగడ్డలో అనూహ్యం: జనసేనలో చేరికపై..!!

Manchu Manoj: ప్రముఖ నటుడు మంచు మనోజ్.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అడుగు పెట్టారు. భార్య భూమా మౌనిక రెడ్డి, కుమార్తె దేవసేనతో కలిసి సుదీర్ఘ విరామం తరువాత అత్తగారింటికి వచ్చారు. మాజీ మంత్రి భూమా శోభా నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆమె సమాధికి నివాళి అర్పించారు.

ఈ ఉదయం ఆళ్లగడ్డ సమీపంలోని ప్రఖ్యాత అహోబిళం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించారు మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి. పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్లారు. దిగువ అహోబిళంలో లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో వారి వెట భూమా విఖ్యాత్ రెడ్డి ఉన్నారు.

Actor Manchu Manoj and Bhuma Mounika visits Ahobilam temple in Nandyal

మంచు మనోజ్- మౌనిక రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతోన్నారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. వారిద్దరూ జనసేన పార్టీలో చేరుతారని, వచ్చే ఎన్నికల్లో మనోజ్ లేదా మౌనిక రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖాయం కావచ్చనే ప్రచారం నంద్యాల జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

జనసేనతో భూమా కుటుంబానికి సత్సంబంధాలు సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. 2009 నాటి ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి.. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. అప్పట్లో పవన్ కల్యాణ్ సైతం ఆమె కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి మెగా కుటుంబంతో భూమా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉంటూ వస్తోన్నాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ గెలుపు కోసం జనసేన నాయకులు సైతం పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె రోడ్ షోలను విజయవంతం చేశారు.

ఈ క్రమంలో ఇక మంచు మనోజ్- మౌనిక రెడ్డి దంపతులు జనసేనలో చేరడం ఖాయమని, దీనికి సరైన ముహూర్తాన్ని చూసుకొంటోన్నారని చెబుతున్నారు. ఆళ్లగడ్డకు వచ్చిన మంచు మనోజ్ కూడా ఈ విషయాన్ని తోసిపుచ్చట్లేదు. అలాగనీ దాన్ని బలపరచనూ లేదు. జనసేనలో చేరికపై ఇప్పట్లో ఏ విషయాన్ని చెప్పలేనని అన్నారు.

ప్రస్తుతం మంచు మనోజ్.. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్‌తో కలిసి భైరవం సినిమాలో నటిస్తోన్నారు. గజపతి వర్మ పేరుతో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌‌ను పోషిస్తోన్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా దీన్ని సమర్పిస్తోన్నాయి. విజయ్ కనకమేడల దర్శకుడు. కేకే రాధామోహన్ నిర్మాత. ఈ మూవీ తరువాత పూర్తిస్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+