"శ్యాంబాబు" పాత్రలో పృథ్వీ ఫుల్ లెంగ్త్ మూవీ - "శోభన్ బాబు", టార్గెట్ ఫిక్స్..!!
బ్రో సినిమా వివాదం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ సినిమాలో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ శ్యాంబాబు పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పాత్రకు అంబటికి సంబంధం లేదని..ఆయన ను అనుకరించే పెద్ద నటుడు కాదని పృథ్వీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈ వివాదం ఇప్పుడు చిరంజీవి తాజా వ్యాఖ్యలతో మరింత ముదిరింది. ఈ సమయంలోనే నటుడు పృథ్వీరాజ్ విడుదల చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది.
శ్యాంబాబు పూర్తి స్థాయి పాత్ర:బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర రాజకీయ వివాదానికి కారణమైంది. దీని పైన మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సహచర మంత్రులు మద్దతుగా నిలిచారు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో మంత్రి రాంబాబు తన నియోజకవర్గంలో నిర్వహించిన భోగి వేడుకల్లో వేసిన డాన్స్ ను అనుకరిస్తూ చేసిన పాత్రగా ప్రచారంలో ఉంది. అంబటి రాంబాబు తన గురించే సినిమాలో ప్రస్తావించారంటూ ఢిల్లీ వరకు విషయాన్ని తీసుకెళ్లారు. సినిమా కలెక్షన్ల గురించి ప్రస్తావన చేసారు. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఇప్పుడు పృథ్వీరాజ్ చేసిన తాజాగా ప్రకటన ఆసక్తి కరంగా మారుతోంది.

శోభన్ బాబు పేరుతో సినిమా:పృథ్వీ రాజ్ కు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. శోభన్ బాబు పేరుతో రాబోతున్న ఈ కొత్త సినిమాలో శ్ాయంబాబు పాత్ర ఏకంగా రెండు గంటలు ఉంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి పృథ్వీ రాజ్ కీలక అంశాలను వెల్లడించారు. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర 1 నిమిషం 5 సెకన్లు ఉంటే, కొత్తగా చేయబోచే సినిమా శోభన్ బాబు సినిమాలో రెండు గంటలు ఉంటుందని వెల్లడించారు.
తనకు ఇది అద్బుతమైన అవకాశంగా పృథ్వీ పేర్కొన్నారు. రచయిత, దర్శకుడు ఎవరు ఉంటారు...ఏ బ్యానర్ లో సినిమా చేస్తున్న వివరాలు త్వరలోనే తెలియచేస్తానని పృథ్వీ చెప్పుకొచ్చారు. అది తన కెరీర్ మలుపుతిప్పే చిత్రం అవుతుందని చెప్పారు.
ఎన్నికల వేళ వివాదంగా:ఈ శ్యాంబాబును కూడా ఆశీర్వదిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లుగా పృథ్వీ చెప్పుకొచ్చారు. ఈ మేరు సెల్ఫీ వీడియోను విడుదల చేసారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 వరోజు ఫంక్షన్ లో ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చిరంజీవి ప్రత్యేక హోదాతో పాటుగా సంక్షేమం, రోడ్లు, పాలన పైన మంచి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
చిరంజీవి చేసిన వ్యాఖ్యల పైన వరుసగా మంత్రులకు మెగాస్టార్ కు సమాధానం ఇస్తూ..ముందుగా పవన్ కు సూచనలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీ కొనసాగుతున్న సమయంలో పృథ్వీ విడుదల చేసిన వీడియో మరింత ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications