వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెన్‌డ్రైవ్‌లో జాతీయపార్టీ 'ఆపరేషన్ ద్రవిడ': ఏపీపై 'గరుడ' ప్లాన్ ఇలా.. ఆ ముగ్గురు నేతలకు ఇలా షాక్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: సినీ నటుడు శివాజీ ఏపీతో పాటు మిగతా రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకునేందుకు ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ ఏర్పాటు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ ద్రవిడ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై చేసిన ఇందులో ఆపరేషన్ గరుడ ఓ భాగమన్నారు.

ఓ జాతీయ పార్టీ భారీ ఆపరేషన్, పావుగా కొత్త నాయకుడు, రూ.4800 కోట్లు ఖర్చు: శివాజీ సంచలనంఓ జాతీయ పార్టీ భారీ ఆపరేషన్, పావుగా కొత్త నాయకుడు, రూ.4800 కోట్లు ఖర్చు: శివాజీ సంచలనం

ఒక జాతీయ పార్టీ, దానికి లక్ష్యంగా ఉన్న ప్రాంతీయ పార్టీ, వారికి ఉపయోగపడే పార్టీ, పావుగా మరో వ్యక్తి ఇలా... ఆ ఆపరేషన్‌ క్రమం ఉంటుందని శివాజీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఇలా చెబుతుంటే ఎవరూ నమ్మరని తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తాను గతేడాది సెప్టెంబర్‌లోనే లీక్‌ చేశానన్నారు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదనచిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఆ జాతీయ పార్టీ భారీ ఆపరేషన్

ఆ జాతీయ పార్టీ భారీ ఆపరేషన్

ఈ ఆపరేషన్‌కు సూత్రధారి ఒక రాజ్యాంగ శక్తి అని శివాజీ అన్నారు. దీనిలోకి వచ్చే వాళ్లకు రావడం మాత్రమేగానీ, బయటకు వెళ్లడం తెలియదన్నారు. కానీ, ఏపీ ప్రజలు పిచ్చివాళ్లు కాదని, సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారన్నారు. ఏపీ ప్రజల్లో ఉన్న అనైక్యతను వాళ్లు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారన్నారు. శివాజీ పెన్ డ్రైవ్‌ను మీడియాకు ఇచ్చారు.

ఆ పార్టీ, సహకరించే వ్యక్తి పేరు చెప్పను కానీ

ఆ పార్టీ, సహకరించే వ్యక్తి పేరు చెప్పను కానీ

తాను ఆ జాతీయ పార్టీ పేరు చెప్పనని, వారికి మద్దతిచ్చే వ్యక్తి పేరు చెప్పనని, వినేవారు అర్థం చేసుకోవాలని శివాజీ చెప్పారు. ఆ జాతీయ పార్టీకి అనుబంధ సంస్థ నేతలు స్లీపర్ సెల్స్‌లా పని చేస్తున్నారని చెప్పారు. కళ్యాణ్ అనే వ్యక్తి దక్షిణాదిన ఆ పార్టీకి సహకరిస్తున్నారని తెలిపారు. పెన్ డ్రైవ్ వీడియోలో సంచలన విషయాలు ఉన్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌పై ఆ జాతీయ పార్టీ పక్కా ప్లాన్ ఇలా

ఆంధ్రప్రదేశ్‌పై ఆ జాతీయ పార్టీ పక్కా ప్లాన్ ఇలా

ముఖ్యంగా, ఏపీలో అధికారంలోకి రావడానికి ఆ జాతీయ పార్టీకి మూడు టార్గెట్లు ఉన్నాయని తెలిపారు. 1 అధికార పార్టీ, 2 కొత్త రాజకీయ నాయకుడు. 3 ఓ ముఖ్యమైన పార్టీ. అధికార పార్టీపై సీబీఐ కేసులు పెడుతుందని, చివరకు మరో పార్టీ నాయకుడు జైలుకు వెళ్తారని, ఏపీ సీఎంగా జాతీయ పార్టీకి చెందిన ఓ తెలుగు వ్యక్తి ఉంటారని శివాజీ అన్నారు.

ఏపీలో అధికార పార్టీపై ఇలా

ఏపీలో అధికార పార్టీపై ఇలా

ఆ జాతీయ పార్టీ ఆపరేషన్ ద్రవిడను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తోందని చెప్పారు. ఏపీకి సంబంధించి అధికార పార్టీ, కొత్త నేత, మరో ముఖ్య పార్టీ. ఇందులో అధికార పార్టీపై సీబీఐ కేసులను రీ ఓపెన్ చేయడం, ఆర్థికంగా దెబ్బతీయడం, చక్రబంధం చేయడం, ఆ పార్టీని చివరకు ఒంటరిని చేయడం వ్యూహాలు అని చెప్పారు.

 కొత్త రాజకీయ నాయకుడికి తెలియదు

కొత్త రాజకీయ నాయకుడికి తెలియదు

తాను పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఆ కొత్త రాజకీయ నాయకుడికి తెలియదని చెప్పారు. స్థానిక ప్రభుత్వాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటాడని చెప్పారు. రాష్ట్రం పట్ల బాధ్యత చూపిస్తారని, రాజకీయాల్లో నుంచి వైదొలిగిన వారిని కొందరిని కలుస్తారని, ఈ కొత్త నాయకుడికి వారు సహకరిస్తారని, ప్రభుత్వాన్ని ఎలా డిస్టర్బ్ చేయాలో చెబుతుంటారని చెప్పారు.

 మూడో ముఖ్య పార్టీపై ఇలా

మూడో ముఖ్య పార్టీపై ఇలా

మూడోది.. మరో ముఖ్య పార్టీ నాయకుడిని కూడా ఇలాగే బలి పశువును చేస్తారని చెప్పారు. ఆ ముఖ్య పార్టీ నేత మీద ఇప్పటికే గుంటూరు, హైదరాబాదులలో రెక్కీ నిర్వహించారని చెప్పారు. పకడ్బంధీగా ప్రాణహానీ లేని దాడి చేస్తారని, దీంతో రాష్ట్రంలో అలజడులు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత ఈ నేతకు కొన్ని కేసుల్లో ఊరట లభిస్తుందని, పూర్తిగా మాత్రం ఉండదని, ఇతర రాష్ట్రాలనుంచి కొందరు వచ్చి అల్లర్లు సృష్టిస్తారన్నారు.

కొత్త నాయకుడికి షాకిస్తారు, అధికార పార్టీ నేత కోవర్టుగా

కొత్త నాయకుడికి షాకిస్తారు, అధికార పార్టీ నేత కోవర్టుగా

పై మూడు టార్గెట్ సెప్టెంబర్ 1 నాటికి పూర్తి చేస్తారని శివాజీ చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి ఎప్పుడైతే ఓ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారో అదే రోజు ఆయనను పదవి నుంచి దింపేస్తారని, కొత్త నాయకుడికి వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడతాయని, ఎన్నికల తర్వాత ఇంకో ముఖ్య పార్టీకి చెందిన వ్యక్తి కూడా కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్తారని, కొత్త నాయకుడిని కేంద్రమంత్రిగా ఉండమంటే ఆయన ఉండరని చెప్పారు. చివరకు ఇప్పటి అధికార పార్టీలోని నేతలు మరో పార్టీలోకి వెళ్తారని, జాతీయ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఓ వ్యక్తి కోవర్టుగా కూడా పని చేస్తున్నారన్నారు.

English summary
Actor Sivaji talks about Operation Garuda and Operation Dravida on Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X