నన్ను పక్కన పెట్టారు, అయినా చంద్రబాబుతోనే ఉన్నా: సినీ నటి కవిత
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను చంద్రబాబు తనను పట్టించుకోకపోవడాన్ని జీర్ణించులేకపోతున్నట్లు సినీ నటీ కవిత అన్నారు. అయినా తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని ఆమె అన్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను చంద్రబాబు తనను పట్టించుకోకపోవడాన్ని జీర్ణించులేకపోతున్నట్లు సినీ నటీ కవిత అన్నారు. అయినా తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని ఆమె అన్నారు.
విజయవాడ: ప్రతిపక్షాలు తమ పార్టీలో చేరమని కోరుతున్నప్పటికీ అన్నగారి మీద అభిమానం, చంద్రబాబు మీద నమ్మకంతోనే ఇంకా పాజిటివ్‌గా ఉన్నానని, టీడీపీని వీడే ప్రసక్తి లేదని సినీ నటి కవిత చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని, సంపాదనను వదిలి పార్టీ కోసం శాయశక్తులా కృషి చేశానని, అధికారంలోకి రాగానే తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె అన్నారు.
ఎప్పటికైనా చంద్రబాబు వాస్తవాలను గ్రహించి నిజమైన కార్యకర్తలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని కవిత అన్నారు. చంద్రబాబు అవిరళంగా రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తున్నారని, ఆయన వినూత్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు పార్టీ అభిమానిగా తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని ఆమె చెప్పారు.

2008లో కాంగ్రెస్ పార్టీలోకి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ వెళ్లిపోతున్నప్పటికీ అన్నగారు స్థాపించిన పార్టీకి తనవంతు సాయం చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు వెంట ఉన్నానని తెలిపారు. చంద్రబాబు మాటే వేదవాక్కుగా పార్టీ పురోభివృద్ధికి తనవంతు సాయం చేశానన్నారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సినీనటి కవిత సోమవారం దర్శించుకున్నారు. సన్నిహితులతో ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆమె రూ.300 క్యూలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వైదిక కమిటీ సభ్యుడు శంకరశాండిల్యను కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు.
అమ్మవారి ఆశీస్సులతో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం సత్వరం జరగాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు ఆమె తెలిపారు. తనకు నటనా జీవితం సంతృప్తికరంగా సాగినా రాజకీయరంగంలో ఒడుదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. సినిమా పరిశ్రమలో ఎక్కువగా అభిమానించే వ్యక్తి ఎన్టీఆర్ అని, 1982లోనే పార్టీ సభ్యత్వం తీసుకుని చైతన్య రథం వెంట ప్రచారాలు నిర్వహించానని చెప్పారు.












Click it and Unblock the Notifications