వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ కుటుంబం వందల హత్యలు చేయించింది: జగన్‌పై ఆది సంచలనం

వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వందల హత్యలు చేయించిందని వాస్తవం అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శుక్రవారం నాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వందల హత్యలు చేయించిందని వాస్తవం అని ఎమ్మెల్యే0 ఆదినారాయణ రెడ్డి శుక్రవారం నాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు కామన్ మ్యాన్ సపోర్ట్ లేదని, సీఎం అయ్యేది లేదని చెప్పారు.

మంత్రి పత్తిపాటి పుల్లారావుపై జగన్ అవినీతి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా జగన్ తీరును నిరసిస్తూ యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆదినారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన 2014లో వైసిపి నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టిడిపిలో చేరారు.

అసెంబ్లీని జగన్ మయ సభ అనుకుంటున్నారని, అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆదినారాయణ ఎద్దేవా చేశారు. 38 ఏళ్ల వైయస్ కుటుంబ చరిత్రను 38 ఓట్లతో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించామని ఆదినారాయణ అన్నారు.

ఆశ ఎక్కువ... భార్యాభర్తలు గొడవపడ్డా సీఎం అయ్యాక అంటారు

ఆశ ఎక్కువ... భార్యాభర్తలు గొడవపడ్డా సీఎం అయ్యాక అంటారు

ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా జగన్ తీరు ఉందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. వయస్సు తక్కువ, ఆశలు ఎక్కువ అన్నారు. ఎవరు ఏది అడిగినా.. నేను ముఖ్యమంత్రి అయ్యాక అని జగన్ అంటారని ఎద్దేవా చేశారు. చివరకు భార్యాభర్తల పంచాయతీ కూడా సీఎం అయ్యాకే అంటారని విమర్శలు గుప్పించారు.

అందుకే 21 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు

అందుకే 21 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు

జగన్‌కు సీఎం పదవి కావాలా, ప్రజా సమస్యల పరిష్కారం కావాలా అని నిలదీశారు. జగన్ ప్రవర్తన నచ్చకనే 21 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారని చెప్పారు. సాక్షి పత్రికను అడ్డుపెట్టుకొని అవాస్తవాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు.

వైయస్ కుటుంబం హత్యలు చేయించింది

వైయస్ కుటుంబం హత్యలు చేయించింది

వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వందల హత్యలు చేయించింది వాస్తవం అని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అన్నింటి్లో ప్రగతి, జగన్ అంటే అన్నింట్లో పుల్లలు పెట్టే వ్యక్తి అన్నారు. జగన్‌కు డబ్బు మీద యావ, పదవి మీద వ్యామోహం అన్నారు.

జైలుకెళ్లి వచ్చిన జగన్‌ను సభ నుంచి సస్పెండ్ చేయాలి

జైలుకెళ్లి వచ్చిన జగన్‌ను సభ నుంచి సస్పెండ్ చేయాలి

సభా నాయకుడు, స్పీకర్ అంటే జగన్‌కు ఏమాత్రం గౌరవం లేకుండా పోయిందని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. సభా సంప్రదాయాలు అందరూ పాటించాల్సిందే అన్నారు. జైలుకు వెళ్లి వచ్చినా ప్రవర్తనలో మార్పు లేదన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన జగన్‌ను అసలు సభ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.

తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జగన్ అరాచకాలు

తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జగన్ అరాచకాలు

జగన్ ఓ వింత ప్రవర్తన కలిగిన వ్యక్తి అని కళా వెంకట్రావు అన్నారు. జగన్ వంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం మన దురదృష్టకరమని చెప్పారు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా జగన్‌లో మార్పు కనిపించడం లేదన్నారు. తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డికి ఆత్మగా, నీడగా ఉండేవారు ఇప్పుడు జగన్ వెంట ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు.

English summary
Telugudesam Party MLA Adinarayana Reddy hot comments on YS Rajasekhar Reddy's family in Andhra Pradesh Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X