రోజా కనిపించాలనే: ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం, 'నంద్యాల టిడిపిదే'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆదినారాయణ రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. రోజా టీవీలో కనిపించాలనే ఉద్దేశ్యంతో రోజూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆదినారాయణ రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. రోజా టీవీలో కనిపించాలనే ఉద్దేశ్యంతో రోజూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆమె చాలా విషయాలు తెలుసుకొని మాట్లాడాల్సి ఉందని సూచించారు. నంద్యాల ఉప ఎన్నికల పైనా ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, బ్రహ్మానంద రెడ్డి అద్భుత విజయం సాధిస్తారన్నారు.
హెరిటేజ్ వ్యాన్‌లో ఎర్రచందనం దుంగలు తరలింపు ఆరోపణలను ఆదినారాయణ రెడ్డి ఖండించారు. వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒకవేళ హెరిటేజ్ వ్యాన్లో దుంగలు తరలిస్తే పోలీసులతో మేనేజ్ చేయలేమా అని ఆయన ప్రశ్నించారు.

ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వ్యాన్ హెరిటేజ్‌ది కాదని పోలీసులు నిగ్గు తేల్చారని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.
హెరిటేజ్ యాజమాన్యం ఖండన
హెరిటేజ్ వాహనాల్లో ఎర్రచందనం ఆరోపణలపై యాజమాన్యం కూడా స్పందించింది. హెరిటేజ్ పాల వ్యాన్‌లో ఎర్రచందనం తొలగిస్తున్నారనే ఆరోపణల్లోఎటువంటి వాస్తవం లేదన్నారు.
పట్టుబడ్డ వాహనానికి, హెరిటేజ్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. హెరిటేజ్ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడదని, హెరిటేజ్ పైన నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ యాజమాన్యం హెచ్చరించింది.












Click it and Unblock the Notifications