Aditya L1 : నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన ఆదిత్య ఎల్ 1-ఇస్రో ప్రయోగం సక్సెస్ !

సూర్యుడి నిగూఢ రహస్యాలను తెలుసుకునేందుకు వీలుగా భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఇవాళ ఆదిత్య ఎల్ 1 మిషన్ ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదిత్య మిషన్ ను ప్రయోగించారు.

నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగసిన ఆదిత్య ఎల్ 1 నౌక విజయవంతంగా ప్రయాణం సాగిస్తోంది. భూమికి దిగువ కక్ష్యలో ఉన్న లాగ్రేజియన్ పాయింట్ లో ఆదిత్య ఎల్ 1 నౌకను చేర్చడం, అక్కడి నుంచి సూర్యుడి గురించి అధ్యయనం చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

Aditya L1 : isro launches indias first solar mission through pslv c57 rocket

ఆదిత్య ఎల్ 1 మిషన్ ను పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ నింగిలోకి మోసుకెళుతుంది. అంతరిక్షపు వాతావరణంలో సూర్యుడి పాత్ర ఎలా ఉంది అనేదానిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ఈ మిషన్‌ను ప్రయోగించింది. సరిగ్గా ఉదయం 11.50 నిమిషాలకు ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 మిషన్.. భూమి నుంచి నింగిలోకి 1.5 మిలియన్ కిలోమీటర్లు మేర ప్రయాణించి లాగ్‌రేంజియన్ పాయింట్ (L1)వద్ద కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇక అక్కడి నుంచి సూర్యుడిని అధ్యయనం చేయడం ప్రారంభిస్తుంది.

ఆదిత్య ఎల్ 1 మిషన్ సూర్యుడి కరోనా, సౌర తుపాన్ల వంటి ఇతర వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయబోతోంది. ఇవాళ నింగికెగసిన ఆదిత్య ఎల్ 1 తాను నిర్దేశించుకున్న లాగ్రాంజ్ పాయింట్ చేరడానికి 125 రోజులు పడుతుంది. భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఇది ఎల్ 1 పాయింట్ కక్ష్యలోకి చేరుతుంది. ఈ పాయింట్ లో భూమి,, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు దాదాపు సమానంగా ఉంటాయి. కాబట్టి ఆదిత్య ఎల్ 1 అంతరిక్ష నౌక బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. ఈ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం 46 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+