Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Aditya L1: ఎల్1 అంటే అర్థం ఏంటీ: లాగ్రాంజ్ అంటే ఎవరు?

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.

ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. సూర్యుడిపై ప్రయోగాలకు సన్నద్ధమైంది. దీనికోసం ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇంకాస్సేపట్లో ఆదిత్య ఎల్ 1‌ సూర్యుడి వైపు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. దీన్ని మోసుకెళ్లడానికి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను వినియోగించనుంది ఇస్రో.

Aditya L1: What is Lagrange point and who was found it?

ప్రయోగించిన రోజు నుంచి ఈ శాటిలైట్ సూర్యుడి దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 110 నుంచి 120 రోజుల తరువాత ఎల్1కు చేరుకుంటుంది. ఆదిత్య మిషన్‌లో ఇప్పుడు ఎల్1 అనే పాయింట్ కీలకంగా మారింది. ఈ ఎల్1 పాయింట్‌లోనే ఈ శాటిలైట్ పరిభ్రమించబోతోంది. అక్కడి నుంచే సూర్యుడిపై అధ్యయనం చేస్తుంది.

సూర్యుడు వివిధ శక్తివంతమైన కణాలు, అయస్కాంత క్షేత్రాన్ని దాదాపుగా అన్ని తరంగ దైర్ఘ్యాలలో రేడియేషన్/కాంతిని విడుదల చేస్తాడనే విషయం తెలిసిందే. దీని నుంచి భూవాతావరణం, దాని అయస్కాంత క్షేత్రం రక్షణ కవచంగా పని చేస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్‌ను అడ్డుకుంటుంది. వాటిని దాటుకుని వివిధ రేడియేషన్లు భూఉపరితల వాతావరణంపైకి చేరుకోవడం అసాధ్యం.

ఈ రేడియేషన్‌ల ఆధారంగా సూర్యుడిపై ఇప్పటివరకూ ఎవరూ అధ్యయనం చేయలేదు. సూర్యుడి నుంచి వెలువడే సౌర పవనాలు, అందులో నుంచి ఉత్పన్నం అయ్యే కణాలు, అయస్కాంత క్షేత్రం అంతరిక్షంలో ఎలా ప్రయాణం చేయగలుగుతుందనేది ఈ విశ్లేషణల ద్వారా తెలుసుకోవాలని భావిస్తోంది ఇస్రో.

Aditya L1: What is Lagrange point and who was found it?

దీనికోసం ఎల్1 పాయింట్‌ను ఎంచుకుంది. ఇదొక హ్యాలో రీజియన్ కావడం వల్లే ఇస్రో దీన్ని ఎంచుకుంది. ఇలాంటి హ్యాలో ఏరియా ఒకటంటూ ఉందనే విషయాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించింది జోసెఫ్ లూయిస్ లాగ్రాంజ్. ఫ్రెంచ్ ఆస్ట్రానమర్, మేథమేటీషియన్. 1736లో ఫ్రాన్స్‌లో జన్మించిన లాగ్రాంజ్.. ఈ పాయింట్‌ను కనుగొన్నారు.

1772-1788 మధ్యకాలంలో ఆయన చేసిన ప్రయోగాల ఆధారంగా దీన్ని గుర్తించారు. లాగ్రాంజ్ క్లాసికల్/న్యూటోనియన్ మెకానిక్స్‌ను రూపొందించారు. ఇది లాగ్రాంజియన్ మెకానిక్స్‌గా భావిస్తారు. ఆయన పేరునే దీనికి పెట్టారు. ఆయన కనిపెట్టిన ఈ పాయింట్ ఇప్పుడు సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ఇస్రోకు ఉపయోగపడుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+