కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బద్వేల్ పోరులో కొత్త ట్విస్టులు-ఏకగ్రీవం సాధ్యమేనా ? టీడీపీ, జనసేన మనసుమార్చుకుంటాయా ?

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్ని ఓ మలుపు తిప్పబోతున్నట్లు ప్రచారం సాగుతున్న బద్వేల్ ఉపఎన్నికల్లో రోజుకో టిస్ట్ చోటు చేసుకుటోంది. ఇందులో భాగంగా అందరికంటే ముందే అభ్యర్ధిని ప్రకటించిన టీడీపీ ఆ తర్వాత ఏకగ్రీవానికి మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంది. అలాగే టీడీపీ అభ్యర్దిని ప్రకటించిన తర్వాత ఏకగ్రీవం మాటెత్తిన వైసీపీ ఇప్పుడు లక్ష మెజారిటీ సాధిస్తామని చెబుతోంది. ఇదే క్రమంలో బద్వేల్లో పోటీ కోసం సిద్ధమైన జనసేన.. ఆ తర్వాత బీజేపీ పోటీ చేస్తుందని తెలిసి ఏకగ్రీవానికి మద్దతివ్వాలని నిర్ణయించింది. ఇలా వరుస ట్విస్టులతో సాగిపోతున్న బద్వేల్ పోరులో మరో ట్విస్ట్ కు రంగం సిద్ధమవుతోంది.

బద్వేల్ ఉపఎన్నిక

బద్వేల్ ఉపఎన్నిక


కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్దానం సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఖాళీ కావడంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహణకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ కూడా ప్రకటించారు. దీంతో ఈ నెల 30న బద్వేల్ ఉపఎన్నిక నిర్వహణకు వీలుగా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి, వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తర్వాత మరో నామినేషన్ దాఖలవుతుందా లేదా అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

బద్వేల్ పోరులో టీడీపీ ట్విస్ట్

బద్వేల్ పోరులో టీడీపీ ట్విస్ట్

బద్వేల్ ఉపఎన్నిక కోసం గతంలో 2019లో పోటీ చేసి ఓడిన అభ్యర్ది ఓబుళాపురం రాజశేఖర్ ను బరిలోకి దింపాలని నిర్ణయించిన టీడీపీ అందరి కంటే ముందు ఆయన పేరు ప్రకటించింది. దీంతో బద్వేల్ పోరు ఆసక్తికరంగా మారుతుందని అంతా భావించారు. కానీ వైసీపీ ఏకగ్రీవ ప్రకటన తర్వాత పునరాలోచనలో పడిన టీడీపీ.. తీవ్ర మల్లగుల్లాల తర్వాత అక్కడ పోటీ నుంచి విరమించుకుని దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కుటుంబసభ్యురాలైన డాక్టర్ సుధ ఎన్నికను ఏకగ్రీవానికి సహకరించాలని నిర్ణయించుకుంది. దీంతో మిగతా విపక్షాలు ఏం చేయబోతున్నాయన్న ఉత్కంఠ నెలకొంది.

 బద్వేల్ పోరులో వైసీపీ టిస్టులు

బద్వేల్ పోరులో వైసీపీ టిస్టులు

బద్వేల్ ఉపఎన్నికలో తమ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణం నేపథ్యంలో ఆయన స్ధానంలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై వైసీపీ కూడా సుదీర్ఘ కసరత్తు చేసింది. చివరికి వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ఉపఎన్నికలోనూ తమదే విజయంగా ఓవైపు చెప్పుకున్న వైసీపీ.. ఏకగ్రీవం చేయాలని విపక్షాలు భావిస్తే ఆహ్వానిస్తామంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఓవైపు విజయంపై ధీమాగా ఉంటూనే మరోవైపు ఏకగ్రీవం పేరుతో వైసీపీ ఎందుకు ట్విస్ట్ ఇచ్చిందన్న చర్చ మొదలైంది.

బద్వేల్లో జనసేన ట్విస్ట్

బద్వేల్లో జనసేన ట్విస్ట్

బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేన పార్టీ.. మిత్రపక్షం బీజేపీకి తన అభిప్రాయం చెప్పింది. గతంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు తిరుపతి ఉపఎన్నికలోనూ బీజేపీ అభ్యర్ధులకు మద్దతిచ్చాం కాబట్టి బద్వేల్లో తమకు మద్దతివ్వాలని కోరింది. అయితే ఈ ప్రతిపాదనకు స్పందనగా బీజేపీ నేతలు అధిష్టానం అభిప్రాయం తీసుకుని చెప్తామని జనసేనకు తెలిపారు. కానీ బీజేపీ అధిష్టానం నుంచి స్పందన వచ్చే లోపే జనసేన ఈ పోటీ నుంచి విరమించుకుని దివంగత ఎమ్మెల్యే కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ ఏకగ్రీవానికి సహకరిస్తామని చెప్పేసి ట్విస్ట్ ఇచ్చింది. దీంతో బీజేపీ ఇరకాటంలో పడింది. అయితే అంతే వేగంగా కోలుకుని జనసేనకు మరో ట్విస్ట్ ఇచ్చింది.

 బద్వేల్లో బీజేపీ హైలెట్ ట్విస్ట్

బద్వేల్లో బీజేపీ హైలెట్ ట్విస్ట్

బద్వేలో పోరులో జనసేన ఎప్పుడైతే పోటీకి దిగాలని భావించిందో అప్పుడే తాము కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై బీజేపీ మంతనాలు మొదలుపెట్టింది. అయితే వెంటనే తమ అభిప్రాయం చెప్పేస్తే మిత్రపక్షం జనసేన నుంచి ఇబ్బందులు తప్పవని భావించిన బీజేపీ కొన్నిరోజులు మౌనం వహించింది. చివరికి జనసేన అక్కడ పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటన చేసిన 24 గంటల తర్వాత స్పందించిన బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు.. తాము మాత్రం పోటీ చేస్తామని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో మిత్రపక్షం జనసేన తప్పుకున్న స్ధానంలో పోటీకి బీజేపీ తెరలేపింది. దీంతో బద్వేల్లో వైసీపీతో పోటీకి బీజేపీ సిద్దమైపోయినట్లే అయింది. అయితే మిత్రపక్షం జనసేన తమను వదిలించుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో వారిని ఇరుకుపెట్టేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

Recommended Video

AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu
 టీడీపీ, జససేన మనసు మార్చుకుంటాయా ?

టీడీపీ, జససేన మనసు మార్చుకుంటాయా ?

ఇప్పుడు ఏకగ్రీవమవుతుందని భావించిన బద్వేల్ పోరు కాస్తా ఉపఎన్నికకు దారి తీసేలా ఉంది. వైసీపీ చేసిన ఏకగ్రీవం ప్రతిపాదనకు టీడీపీ, జనసేన మద్దతిచ్చినా.. బీజేపీ మాత్రం పోటీకి దిగాలని నిర్ణయించుకోవడంతో అక్కడ పోటీ అనివార్యమవుతుంది. అప్పుడు ఏకగ్రీవం కాకుండా ఉపఎన్నిక జరిగే చోట తాము తప్పుకోవడం సరైంది కాదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే జనసేనలోనూ అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బద్వేల్లో పోటీ కోసం టీడీపీ, జనసేన కూడా సిద్ధమయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఎలాగో బీజేపీ పోటీ చేస్తోంది కాబట్టి ఎన్నిక ఏకగ్రీవం కాదు. దీంతో తాము పోటీ చేస్తేనే మంచిదని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీతో తెగదెంపులకు సిద్ధమవుతున్న ప్రచారం సాగుతున్న జనసేన కూడా తాము కూడా పోటీకి సిద్ధమైతే ఎలా ఉంటుందన్న దానిపై మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో టీడీపీ, జనసేన కూడా బద్వేల్ లో పోటీకి సిద్ధమైతే కచ్చితంగా ఇదే అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ కానుంది.

English summary
after bjp's decision to contest in badvel byelection, there may be a chance to tdp and janasena reconsider their decision on unanimous election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X