చంద్రబాబు , జగన్ హామీల్లో కొత్త ట్విస్ట్ - గెలుపులో ఆ ఒక్కటే కీలకం..!!
వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ సంక్షేమ పథకాల పై ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోపైన స్పష్టత రావటంతో రెండు పార్టీల హామీలతో కొత్త చర్చ మొదలైంది. ఇద్దరు నేతల హామీలతో కలిసొచ్చేదెవరికి అనే చర్చ మొదలైంది. జగన్ తాను అమలు చేసిన నవరత్నాలతో తిరిగి అధికారంలోకి వస్తాననే నమ్మకంతో ఉన్నారు. తాజా మేనిఫెస్టోలో కొన్ని పథకాల పరిమితిని పెంచారు.
జగన్ మేనిఫెస్టోలో
జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలను కొనసాగిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అమ్మఒడి రూ 15 వేల నుంచి రూ 17 వేలకు పెంచారు. రైతు భరోసా రూ 13,500 నుంచి రూ 16 వేలకు పెంచుతూ హామీ ఇచ్చారు. కొనసాగుతున్న మహిళా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, మత్స్యకారుల పథకం, నేతన్న హస్తం వంటి పథకాలను మరో అయిదేళ్లు కొనసాగిస్తామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతీ మహిళకు ఇంటి పట్టా..ఇంటిని అందిస్తామని చెప్పారు. అయితే, అమ్మఒడి ప్రస్తుతం ఇస్తున్నట్లుగా ఒక్క బిడ్డకే పరిమితం చేసారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

జగన్ - చంద్రబాబు హామీలతో
చంద్రబాబు ప్రతీ ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ అమ్మ ఒడి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రైతుకు ఏడాదికి రూ 20 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు ప్రతీ మహిళకు నెలకు రూ 2500 ఇస్తామని హామీ ఇచ్చారు. మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసీ బస్సల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి వాటి పైన హామీ ఇచ్చారు. పెన్షన్ రూ 4 వేలు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే, జగన్ పెన్షన్ ను రూ 3 వేల నుంచి రూ 3,500కి పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు చెప్పిన హామీలకు చేయాల్సిన ఖర్చు..తన హామీలకు చేయాల్సిన ఖర్చు గురించి వివరించారు. తన పథకాలకు రూ 70 వేల కోట్లు ఖర్చు అవుతుండగా..చంద్రబాబు పథకాలకు రూ 1.50 కోట్లు ఖర్చు అవుతాయని వివరించారు.
విశ్వసనీయతే కీలకంగా
అయితే, ఇక్కడ పథకాల అమల్లో ఒకటే అంశం కీలకంగా మారనుంది. జగన్ ప్రతీ సభలో చంద్రబాబు విశ్వసనీయత గురించి ప్రస్తావిస్తున్నారు. 2014 లో ఇదే మూడు పార్టీల కూటమి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయని అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటు చంద్రబాబు తాము జగన్ కంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని..సంపద ఎలా పెంచాలో తమకు తెలుసని చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో సంపద పెరగలేదని జగన్ లెక్కలతో వివరించారు. జగన్ తన మేనిఫెస్టోలో కొత్త హామీలకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలు..జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు..ఎన్నికల్లో ఎవరికి కలిసి వస్తుంది..ఇద్దరిలో హామీల అమలులో ప్రజలు ఎవరిని విశ్వసిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications