చంద్రబాబుకు తోలు మందం.. : మరోసారి జగన్ ఎటాక్
కదిరి : 'చంద్రబాబును చెప్పుతో కొట్టాలంటూ..' ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యల తీవ్రత ఇంకా చల్లారకముందే, మరోమారు చంద్రబాబుపై వివాదస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు జగన్. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్.పీ కుంట మీదుగా నేటి రైతు భరోసా యాత్ర సాగుతున్న నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.
యాత్రలో భాగంగా ఎన్ పీ కుంటలో ప్రసంగించిన జగన్.. సీఎం చంద్రబాబు తోలు మందం వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తోలు మందం ఎక్కువైనందుకే ఆయన రైతుల సమస్యలను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన హిట్లర్ తరహా నియంత పోకడలతో సాగుతుందని ఆరోపించిన ఆయన, భూకుంభకోణాలు చేస్తున్నవారిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

సాగునీటి వసతి ఉన్నా.. పంటలు పండడమే కష్టమైనపోయిన తరుణంలో, అంతో ఇంతో సాగుకు పనికొచ్చే భూములను సోలార్ పవర్ ప్లాంటుకు ఎందుకు కట్టబెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంతమంది భూములను అన్యాయంగా లాక్కున్నా, కనీసం బాధిత కుటుంబాల్లో ఒక్కరికి కూడా పవర్ ప్లాంట్ లో ఉద్యోగం కల్పించలేదన్నారు.












Click it and Unblock the Notifications