ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీ: వర్షపు నీటిని ఎత్తిపోసిన సిబ్బంది..

తాజాగా కురిసిన వర్షాలకు సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న నీటిపారుదల విభాగం కార్యాలయంలోకి నీరు వచ్చి చేరింది.

అమరావతి: వెలగపూడిలోని ఏపీ సచివాలయాన్ని లీకేజీ బెడద వెంటాడుతూనే ఉంది. నెల క్రితం జగన్ ఛాంబర్ లీకేజీతో విమర్శలు మూటగట్టుకున్న ప్రభుత్వం.. దాని వెనకాల కుట్ర దాగుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆపై లీకేజీ వ్యవహారంపై ఓ కమిటీని కూడా నియమించారు.

ఇక తాజాగా కురిసిన వర్షాలకు సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న నీటిపారుదల విభాగం, మంత్రి గంటా శ్రీనివాసరావు యాంటీ రూమ్, మంత్రి దేవినేని ఉమా ఛాంబర్లలో వర్షపు నీరు లీకేజీ అయింది. సోమవారం మధ్యాహ్నాం నుంచి కురుస్తున్న వర్షానికి.. గ్లాస్ విండోల నుంచి, కొన్ని చోట్ల పై ఫ్లోర్ ల నుంచి వాటర్ లీకవుతోంది.

again rain water leakage in ap secretariat

మంత్రి గంటా శ్రీనివాసరావు యాంటీ రూమ్ లో సీలింగ్ తడిసి ఊడిపడింది. జలవనరుల శాఖ విభాగంలో చాలా చోట్ల గోడల వెంబడి వర్షపు నీరు లీకవుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. వర్షపు నీటిని సిబ్బంది బకెట్లతో ఎత్తి పోస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+