మంత్రి అవుతాడని 2 నెలలు ముందే చెప్పిన అఘోరా

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4.45 గంటలకు సచివాలయంలో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన తర్వాత మిగతా మంత్రులంతా రెండుమూడురోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈరోజుకానీ, రేపు కానీ మంత్రులకు శాఖలను కేటాయిస్తున్నారు.

గతంలో కూడా మంత్రిగా..
నంద్యాల నుంచి విజయం సాధించిన ఎన్ఎండీ ఫరూక్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మైనార్టీకి చెందిన సీనియర్ నేత కావడంతో చంద్రబాబు ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 2014 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో నంద్యాల నుంచే ఘనవిజయం సాధించారు. ఎన్నికలకు రెండునెలలు ముందు ఫరూక్ కు సంబంధించి ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

Aghora said two months ago NMD Farooq will become a minister

ప్రమాదం నుంచి బయటపడి..
ఫరూక్‌ నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నప్పుడు ఓ అఘోరా అక్కడికి రావడంతో అందరూ ఆశ్చర్యపోరయారు. ఫరూక్ కార్యకర్తల సమావేశంలో ఉన్నారు. ఆయన నేరుగా ఫరూక్ దగ్గరకు వచ్చి ఆశీర్వదించారు. అడ్డంకులన్నీ ఎదుర్కొని గెలిచిన తర్వాత మంత్రి అవుతావు అని చెప్పారు. హిందూ, ముస్లింలు సోదర భావంతో కలిసి మెలిసి ఉంటారన్నారు. అఘోరా చెప్పినదే నిజమైంది. ఆయన చెప్పినట్లుగానే ఎన్నికలకు ముందు ఓ కష్టాన్ని దాటారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న గాయాలతో ఆయన తప్పించుకున్నారు. చంద్రబాబు కేబినెట్ లో ఇప్పుడు మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అఘోరా చెప్పిందే నిజమైందంటూ ఫరూక్ అభిమానులు దీన్ని వైరల్ చేస్తూ ట్రెండింగ్ లో కి తెస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+