హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌-విజయవాడ- సంక్రాంతి స్పెషల్‌ విమానాలు- గంట సేపు ప్రయాణం

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి వచ్చిందంటే చాలు పట్టణాలు, నగరాల నుంచి జనం పల్లెలకు వాలిపోతుంటారు. పల్లెల్లో సంక్రాంతి జరుపుకుంటే అదో ప్రత్యేకత. అదో సంతృప్తి. సొంత ఊళ్లను వదిలిపెట్టి సైతం బంధువులు ఉంటే పల్లెలకు వాలిపోవడం తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణం. ఈసారి కూడా అదే ట్రెండ్‌ కొనసాగబోతోంది.. అయితే కరోనా కారణంగా మారిన పరిస్ధితుల్లో బంధుమిత్రులతో కలిసి ఈ సంక్రాంతి జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ భావిస్తున్నారు. దీంతో సంక్రాంతి రద్ద కూడా అనూహ్యంగా పెరిగిపోతోంది. దీంతో ఇప్పటికే ప్రత్యేక బస్సులు, రైళ్లు సిద్ధమైపోతున్నాయి. ఇదే కోవలో ఈసారి హైదరాబాద్ టూ ఏపీ ప్రత్యేక విమానాలు కూడా రెడీ అవుతున్నాయి.

సంక్రాంతి రద్దీతో జనం ఏర్పాట్లు

సంక్రాంతి రద్దీతో జనం ఏర్పాట్లు

సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వాసులంతా పండక్కి సొంత ఊర్లకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి రద్దీ గురించి అనుభవం ఉన్న వారంతా ఇప్పటికే సొంతూర్లకు పయనం అయ్యేందుకు టికెట్లు బుక్ చేసేసుకున్నారు. మిగిలిన వారు కూడా అదే పనిలో బిజీగా ఉన్నారు. ఈ వారం చివరి నుంచి ఈ రద్దీ మరింత పెరగబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక సర్వీసులు ప్రకటిస్తున్నారు. వీటి టికెట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ భారీ ఎత్తున బుకింగ్స్‌ను ప్రోత్సహిస్తున్నారు.

ఈసారి సంక్రాంతి స్పెషల్‌ విమానాలు

ఈసారి సంక్రాంతి స్పెషల్‌ విమానాలు

సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వారి కోసం త్వరలో ప్రత్యేక విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి సంక్రాంతికి అదనపు సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలను ప్రకటించింది. మరికొన్ని విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి రద్దీకి అనుగుణంగా సర్వీసులను నడిపే యోచనలో ఉన్నాయి. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్‌ను తాజాగా స్పైస్‌జెట్‌ విమాన సంస్థ విడుదల చేసింది.

స్పెషల్‌ జెట్‌ టైమింగ్స్‌ ఇవే

స్పెషల్‌ జెట్‌ టైమింగ్స్‌ ఇవే


సంక్రాంతి పండుగకు కేవలం మూడు రోజుల ముందు నుంచీ ఈ ప్రత్యేక విమాన సర్వీసులు విజయవాడ- హైదరాబాద్‌-విజయవాడ మధ్య నడుస్తాయి. జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు ప్రతి రోజూ సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయల్దేరి 5.30కు విజయవాడకు వస్తుంది. తిరిగి విజయవాడ నుంచి సాయంత్రం 6 గంటకు ఇదే సర్వీసు బయల్దేరి హైదరాబాద్‌కు రాత్రి 7.10కి చేరుతుంది.
జనవరి 16 నుంచి మరో సర్వీసు విజయవాడలో ప్రారంభం కానుంది. ఈ విమానం ప్రతి రోజు మధ్యాహ్నం 3.20కు బయలుదేరి 3.55కు హైదరాబాద్‌కు వెళుతుంది. ఇది జనవరి 30వ తేదీ వరకు నడుస్తుంది.
ఇక, జనవరి 11 నుంచి 28వ తేదీ వరకు మరో కొత్త సర్వీసు ప్రారంభమవుతుంది. ఈ విమానం విజయవాడలో మధ్యాహ్నం 3.20కు బయల్దేరి హైదరాబాద్‌కు 4.10కి చేరుతుంది.

గంట సేపు ప్రయాణంతో సౌలభ్యం

గంట సేపు ప్రయాణంతో సౌలభ్యం

ఈ ప్రత్యేక విమానాలు కేవలం సాధారణ రోజుల తరహాలోనే గంటసేపటిలో గమ్యానికి చేరుకుంటాయి. దీంతో ప్రయాణికులకు భారీగా సమయం, డబ్బు కూడా ఆదా అవుతాయి. కేవలం గంటసేపు ప్రయాణంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకునే అవకాశం ఉండటంతో చివరి నిమిషంలో రద్దీతో బస్సు, రైలు టికెట్లు దొరకని వారు బ్లాక్‌లో ఎక్కువ మొత్తాలు వెచ్చించకుండా విమానాలను ఎంచుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పేరుకి ప్రత్యేక విమానాలు అయినా బస్సులు, రైళ్ల తరహాలో వీటికి ప్రత్యేక ఛార్జీలు ఉండవని చెబుతున్నారు.

English summary
private airlines are planning to run special flights between hyderabad and vijayawada cities in this sankranti season to meet travellers rush.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X