బైక్‌పై చుడుతూ అక్బర్: భార్యాభర్తలు ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరిగే తెలంగాణ ప్రాంతంలో ప్రచారం ముమ్మరమైంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రజల్లోకి చొచ్చుకుపోయి, ఓటు అడుగుతున్నారు. ప్రచారానికి వివిధ పద్ధతులను ఎంచుకుంటున్నారు. హైదరాబాదులోని అంబర్‌పేట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు.
హైదరాబాదులోని పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో మజ్లీస్ అభ్యర్థి, సిట్టింగ్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఇరుకు వీధుల్లో సంచరించి, సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుసుకోవడానికి బైక్‌ను ఎన్నుకున్నారు. ఆయన బైక్‌పై తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు.
హైదరాబాదు శివారులోని చేవెళ్ల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి స్వయంగా ప్రజలను కలుస్తుండగా, ఆయన భార్య సంగీతా రెడ్డి ఇంటింటికీ తోరణం కార్యక్రమాన్ని చేపట్టి తన భర్త కోసం ప్రచారం సాగిస్తున్నారు.

బైక్‌పై అక్బరుద్దీన్ స్వారీ..
మజ్లీస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ స్వయంగా బైక్ నడుపుతూ చాంద్రాయణగుట్ట శానససభా నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు.

అక్బరుద్దీన్ ఇలా ప్రచారం..
మజ్లీస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో బైక్ నడుపుతూ ఇలా ప్రచారం సాగిస్తున్నారు.

సబ్బం హరి ఇలా...
సమైక్యాంధ్ర నాయకుడు సబ్బం హరి పచ్చటి వాహనంలో ఇలా ప్రచారం సాగిస్తున్నారు. ఆయన పార్టీ జెండా ఊపుతూ సాగుతున్నారు.

వాహనంలో వెళ్తూ..
వాహనంలో ప్రయాణిస్తూ ప్రజలకు ఇలా అభివాదం చేస్తూ జై సమైక్యాంధ్ర నాయకుడు సబ్బం హరి ప్రచారం సాగిస్తున్నారు.

కొండా భార్య ఇలా..
చేవెళ్ల తెరాస అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతా రెడ్డి ఇంటింటికీ తోరణమంటూ ఓటర్లను పలకరించి తన భర్తకు మద్దతు కూడగడుతున్నారు.

పూలు పంచుతూ దత్తాత్రేయ
సికింద్రాబాద్ బిజెపి లోకసభ అభ్యర్థి బండారు దత్తాత్రేయ పార్టీ చిహ్నం కమలం పూవులు పంచుతూ ప్రచారం సాగించారు.

కొండా విశ్వేశ్వర రెడ్డి ఇలా..
భార్య సంగీతా రెడ్డి ఇంటింటికీ తోరణం కార్యక్రమాన్ని చేపట్టగా చేవెళ్ల తెరాస అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రజలను కలుస్తున్నారు. నిజాంపేటలో జరిగిన సభలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications