రాజీనామా చేస్తా: నంద్యాలపై అఖిల, శిల్పా దిమ్మతిరిగే సవాల్, సంప్రదాయంపై ట్విస్ట్
నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని ప్రకటించడంతో ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని ప్రకటించడంతో ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. ఏకగ్రీవం కోసం టిడిపి, మంత్రి అఖిలప్రియ, భూమా కుటుంబ సభ్యులు చేస్తామని చెప్పినప్పటికీ వైసిపి తగ్గేలా లేదు.
ఈ ఉప ఎన్నికను టిడిపి కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తమ పార్టీ నుంచి గెలిచి, టిడిపిలో చేరారని, అది తమ సీటు అని, అలాంటప్పుడు టిడిపి అభ్యర్థిని ప్రకటించి ఏకగ్రీవమని చెప్పటంపట్ల జగన్ అసహనంతో ఉన్నారు.

పోటాపోటీ
నంద్యాల ఉప ఎన్నికను వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. అభ్యర్థిని ప్రకటించిన టిడిపి కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఏకగ్రీవానికి మద్దతివ్వకుంటే వైసిపికే నష్టమని చెబుతున్నారు. అక్కడ భూమాకు ఉన్న మద్దతు, టిడిపి ఓటు బ్యాంకుతో సులభంగా గెలుస్తామని చెబుతున్నారు.

మంత్రి పదవికి రాజీనామా
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అఖిలప్రియ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ సవాల్ చేశారు. దీనిపై శిల్పా మోహన్ రెడ్డి కూడా స్పందించారు.

అఖిలకు శిల్పా సవాల్
నంద్యాలలో టిడిపి ఓడిపోతే రాజీనామా చేస్తానని మంత్రి అఖిలప్రియ మరోసారి స్పష్టంగా చెబితే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాననే సవాల్‌ను స్వీకరిస్తానని మాజీ మంత్రి, నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి దిమ్మతిరిగేలా ప్రతిసవాల్ విసిరారు.

సంప్రదాయంపై శిల్పా కొత్త ట్విస్ట్
నంద్యాలలో భూమా కూతురు లేదా కుమారుడు పోటీ చేసి ఉంటే వైసిపి సంప్రదాయాన్ని పాటించేందని శిల్పా మోహన్ రెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. భూమా కుటుంబం పోటీ చేయడం లేదని, బంధువులు పోటీ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications