టిడిపికి షాక్: నంద్యాలలో వైసీపీకి నాగార్జున అభిమానుల మద్దతు
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి అక్కినేని నాగార్జున అభిమానులు మద్దతు ప్రకటించారు.
నంద్యాల: నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి అక్కినేని నాగార్జున అభిమానులు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులు కూడ శిల్పాకే మద్దతు ప్రకటించారు.
నంద్యాలలో ప్రతి ఓటును కీలకంగా భావించిన నేపథ్యంలో టిడిపి, వైసీపీలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలను చేస్తున్నాయి. పోలింగ్‌కు మూడు రోజుల ముందుగానే అక్కినేని నాగార్జున అభిమానులు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతును ప్రకటించారు.ఈ మేరకు అఖిలభారత అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసిసోయేషన్ అధ్యక్షుడు ఏవీ నాగరాజు ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.

నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని ఆయన ఆ ప్రకటనలో అభిమానులను కోరారు.మహేష్‌బాబు బాబాయ్ వైసీపీ నేత ఆదిశేషగిరిరావు మహేష్‌బాబు, కృష్ణ అభిమానులతో వారం రోజుల క్రితం సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించేందుకు కృసి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. వైసీపీ అభ్యర్థి తరపున ఇప్పటికే మహేష్‌బాబు అభిమానులు ప్రచారం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications