కళ్లెంట నీరు: మోడీ ఆల్బమ్‌పై హాయ్‌రబ్బా స్మిత

హైదరాబాద్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతుగా చేసిన ఆల్బమ్ విని తనను అభినందించడానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత అనుమోలు రామనాయుడు వచ్చినప్పుడు తనకు కళ్లలో నీళ్లు వచ్చాయని హాయ్‌రబ్బా పాప్ సింగ్ స్మిత అన్నారు. ఆమె ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీపై వేకప్ ఇండియా పేర నిర్మించిన ఆల్బమ్‌పై మాట్లాడారు. ఆ ఆల్బమ్ చేసినందుకు అనుమోలు ఇంటికి వచ్చి ప్రసాదం, సాయిబాబా ఫోటో ఇచ్చారని, దాంతో తనకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయని ఆమె అన్నారు.

నరేంద్ర మోడీ విషయంలో మాస్ హిస్టీరియాగా కాకుండా నేరుగా చెప్పాలనే ఉద్దేశంతో చేశానని ఆమె అన్నారు. నరేంద్ర మోడీ వ్యక్తి మాత్రమేనని, మోడీని ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా చూడడం లేదని స్మిత అన్నారు. సంఘసేవ కోసం నరేంద్ర మోడీ రాజకీయాల్లోకి వచ్చారని ఆమె అన్నారు. మోడీ గురించి తెలుసుకున్నప్పుడు చందమామ కథలు చదివిని భావన కలిగిందని ఆయన అన్నారు.

Album on Modi in Hindi is ready: Smitha

మోడీ కృషి చాలా ఉందని, గుజరాత్ అభివృద్ధి గురించా చాలా వింటుంటామని, దాన్ని స్వయంగా చూస్తే కలిగే భావన గొప్పదని, తాను ఒక్కసారి గుజరాత్ వెళ్లానని, విస్తృత అధ్యయనానికి మళ్లీ వెళ్తానని స్మిత అన్నారు. తన ఆల్బమ్‌కు మంచి గుర్తింపు వచ్చిందని ఆమెచెప్పారు.

ఏదో ఒక్కసారి ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఓసారి మార్పు వస్తుందని, తనలో అలాంటి మార్పు వచ్చందని ఆమె అన్నారు. అనుమోలు తనను కలిసిన సంఘటన తనలో మార్పు తెచ్చిందని ఆమె అన్నారు. తెలుగులో చేసిన వేకప్ ఇండియా ఆల్బమ్ హిందీలో కూడా సిద్ధంగా ఉందని, దాన్ని నరేంద్ర మోడీ విడుదల చేయాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. తనకు ఎవరూ చెప్పలేదని, తనంతతానుగానే ఆల్బమ్ చేశానని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+