మోసం చేశారు: అశోక్, పోలీస్ జై తెలంగాణ, గండ్ర అండ

ఇప్పటికైనా సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు కళ్లు తెరవాలన్నారు. చివరి అవకాశంగా బయటకు రావాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో సమైక్య రాష్ట్రానికి కట్టుబడిన నేతలను గెలిపించాలన్నారు. 2014 ఎన్నికల వరకు రాష్ట్ర విభజన జరగకుండా చూస్తామని అశోక్ బాబు చెప్పారు. అనంతరం జై సమైక్యాంధ్ర అంటూ ప్రజలచే నినాదాలు చేయించారు.
సిఎల్పీ వద్ద జై తెలంగాణ
హైదరాబాదులోని సిఎల్పీ కార్యాలయం వద్ద సంజీవులు అనే కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు చేస్తొన్న కుట్రలను ఎండగట్టాలని అతను నినదించాడు. దీంతో మిగతా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
కానిస్టేబుల్‌ను విడుదల చేయాలని గండ్ర బైఠాయింపు
జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్‌ను అరెస్టు చేయడంతో ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు అతనిని విడుదల చేశారు. సంజీవులు జై తెలంగాణ నినాదంపై తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ.. ఇది ఆరంభం మాత్రమేనని, పోలీసుల్లో కూడా తిరుగుబాటు తప్పదని అన్నారు.












Click it and Unblock the Notifications