వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే ఏపీ పరిషత్ కౌంటింగ్-తేలనున్న 18వేల మంది భవితవ్యం- సిబ్బందికి వ్యాక్సిన్ తప్పనిసరి

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు జరగబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా పలువురు ఐఏఎస్ అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు. అలాగే కౌంటింగ్ సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ ను తప్పనిసరి చేశారు.

ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వివిధ కారణాలతో నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్ధానాలకు
ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది మార్చి7న ఎన్నికల నిర్వహణ చేపట్టారు. మొత్తం 9672 స్ధానాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 2371 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్ధుల మృతితో 81 స్ధానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. పలు ఇబ్బందులు తలెత్తినా చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన.. 7220 స్ధానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 18,782 మంది అభ్యర్ధులు పోటీ చేశారు.

all set for ap mptc and zptc election counting tomorrow, covid 19 vaccine is must for staff

రాష్ట్రంలో మొత్తం జడ్‌పీటీసీ స్థానాలు 660 ఉండగా.. ఇందులో నోటిఫికేషన్ జారీ సమయంలో.. 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి7న 652 స్ధానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చివరికి ఈ ఏడాది ఏప్రిల్8వ తేదీన.. 515 స్ధానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో మొత్తం 2058 అభ్యర్ధులు పోటీ చేశారు. ఇప్పుడు వీరందరి భవితవ్యం రేపు తేలబోతోంది.

all set for ap mptc and zptc election counting tomorrow, covid 19 vaccine is must for staff

మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరయ్యే సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకొని ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఆదేశాలు ఇచ్చారు. కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించి పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

all set for ap mptc and zptc election counting tomorrow, covid 19 vaccine is must for staff

లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా కలెక్టరు, ఎస్పీలు కలిసి చర్చించుకొని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. . ప్రతి కేంద్రం వద్ద ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని బాధ్యుడిగా పెట్టాలని. జేసీలకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు తాము అన్ని వేళల్లో సిద్ధంగా ఉంటామని అన్నారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మాట్లాడుతూ అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీలతో నిఘాకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ మాట్లాడుతూ లెక్కింపు కేంద్రాల్లో నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండాలని, అందుకు వీలుగా జనరేటర్లు కూడా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. బ్యాలెట్‌ బాక్సుల్ని కౌంటింగ్‌ హాలులోకి తీసుకొచ్చే సమయంలో పూర్తిగా సీసీటీవీ కవరేజీ ఉండాలని అన్నారు.

English summary
all set for tomorrow's ap mptc and zptc elections votes counting process across the state tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X