విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో స్వాతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం-విజయవాడలో జగన్, జిల్లాల్లో మంత్రుల పతాకావిష్కరణ

|
Google Oneindia TeluguNews

ఏపీలో 75వ స్వాతంత్ర దినోత్సవానికి రంగం సిద్ధమైంది. దేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతన్న ఈ వేడుకలకు ఈసారి ఎంతో ప్రాధాన్యముంది. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుకలను రాష్ట్రంలోనూ అదే స్ధాయిలో నిర్వహించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమైంది. విజయవాడలో సీఎం జగన్, జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు పతాకావిష్కరణలు చేయబోతున్నారు. ఈసారి వేడుకలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

 75 ఏళ్ల స్వాతంత్రం

75 ఏళ్ల స్వాతంత్రం

మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. రెండు శతాబ్దాలకు పైగా బ్రిటీషర్ల పాలనలో మగ్గిపోయిన భారతీయులకు స్వాతంత్రం లభించిన అరుదైన సందర్భం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతీ భారతీయుడూ దీన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వాడవాడలా జాతీయ జెండాను రెపరెపలాడించే క్షణం కోసం అంతా ఉద్వేగంగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో నిర్వహిస్తోంది.

 స్వాతంత్ర వేడుకలకు సిద్ధమైన ఏపీ

స్వాతంత్ర వేడుకలకు సిద్ధమైన ఏపీ

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుత రాజధాని అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేడుకల్ని ఘనంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రేపు విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా జాతీయ జెండాను రెపరెపలాడించడం ద్వారా ప్రజలకు, రేపటి పౌరులకు దేశభక్తిని చాటుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

 విజయవాడలో జగన్ పతాకావిష్కరణ

విజయవాడలో జగన్ పతాకావిష్కరణ

రేపు ఉదయం 9 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో ఎప్పటిలాగే సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రిహార్సల్స్ కూడా పూర్తి చేసింది. పోలీసుల కవాతుతో పాటు రాష్ట్ర ప్రగతిని సూచించే విధంగా శకటాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలతో పాటు ఇతర ప్రగతి సూచికలను కూడా ప్రదర్శించబోతున్నారు. అయితే ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తుండటంతో స్టేడియం బురదమయంగా మారింది. రేపు ఉదయానికి వర్షం తగ్గితే వేడుకలు జరిగే అవకాశముంది.

 జిల్లాల్లో మంత్రుల పతాకావిష్కరణ

జిల్లాల్లో మంత్రుల పతాకావిష్కరణ

75వ స్వాతంత్ర దినోత్సవాన్ని రాష్ట్రంలోని ఆన్ని జిల్లాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రుల్ని తమకు కేటాయించిన జిల్లాల్లో పతాకావిష్కరణ చేయించేందుకు ప్రభుత్పం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం కొడాలి నాని శ్రీకాకుళంలోనూ, వెల్లంపల్లి శ్రీనివాస్ విజయనగరంలోనూ, కన్నబాబు విశాఖపట్నంలోనూ పతాకావిష్కరణ చేస్తారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ధర్మాన కృష్ణదాస్, పశ్చిమగోదావరి జిల్లాలో పేర్నినాని, గుంటూరు జిల్లాలో రంగనాథరాజు, ప్రకాశం జిల్లాలో విశ్వరూప్, నెల్లూరు జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూల్లో అనిల్ కుమార్ యాదవ్, కడపలో ఆదిమూలపు సురేష్, అనంతపురంలో బొత్స సత్యనారాయణ, చిత్తూరు జిల్లాలో మేకపాటి గౌతంరెడ్డి పతాకావిష్కరణ చేయబోతున్నారు.

Recommended Video

Country Needs To Be Made Better And More Prosperous - Defense Minister Rajnath Singh
 అసెంబ్లీ, హైకోర్టులోనూ

అసెంబ్లీ, హైకోర్టులోనూ

రేపు అసెంబ్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవంలో ఉదయం 8.15 గంటలకు స్పీకర్ తమ్మినేని సీతారాం, కౌన్సిల్లో ప్రోటెం స్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అలాగే సచివాలయంలో మొదటి భవనం వద్ద ఉ.7.30 గం.లకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అదేవిధంగా నేలపాడు వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద ఉ‌.10 గం.లకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు..

English summary
andhrapradesh is all set for 75th independence day celebrations tomorrow. chief minister ys jagan to hoist the national flag at vijayawada indira gandhi municipal stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X