టీడీపీలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు - అనర్హత వేటు..!?
నెల్లూరు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కంచుకోటలో ఆ పార్టీని దెబ్బ తీయటానికి టీడీపీ వరుస వ్యూహాలు అమలు చేస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసారని జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది.
ఇప్పుడు వారు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ముందుగా లోకేష్ యాత్రలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వారి పైన అనర్హత వేటు దిశగా చర్చల మొదలైంది. వారు రాజీనామా చేస్తారా..వారి పై అనర్హత వేటు వేస్తారా అనేది ఉత్కంఠను పెంచుతోంది.

టీడీపీలో చేరేందుకు సిద్దం: నెల్లూరులో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు అధికారికంగా టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరేందుకు సిద్దమని చెప్పారు. రాజీనామా అంశం పార్టీ పోలిట్ బ్యూరోలో చర్చించిన తరువాత నిర్ణయిద్దామని చంద్రబాబు సూచించారు.
మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇంటికి వెళ్లిన టీడీపీ నేతలు పార్టీ లోకి రావాలని ఆహ్వానించారు. అటు మేకపాటి చంద్రశేఖర రెడ్డి నేరుగా లోకేష్ ను కలిసి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ ముగ్గురు నేతలు టీడీపీలో చేరేందుకు సిద్దమైనా..ముందుగా లోకేశ్ పాద యాత్ర ఈ నెల 13న నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తోంది. ఈ ముగ్గురు లోకేశ్ యాత్రలో పాల్గొని..జిల్లాలో సక్సెస్ చేసే బాధ్యతల్లో భాగస్వాములు అవుతున్నారు.
లోకేశ్ యాత్రకు మద్దతుగా: లోకేశ్ పాదయాత్ర తరువాత తెలుగుదేశంలో చేరుతానని ఆనం ప్రకటించారు. మేకపాటి, కోటంరెడ్డి అదే ఆలోచనలో ఉన్నారు. ఈ ముగ్గురి ఎమ్మెల్యేల అడుగుల పైన వైసీపీ నాయకత్వం కన్నేసి ఉంచింది. వారిసి సస్పెండ్ చేసినా... సాంకేతికంగా ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు రాజీనామా చేయకుండా లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటే వైసీసీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.
ఈ ముగ్గురు తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరటం ద్వారా ఎన్నికల సమయానికి నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ కు దగ్గరవ్వటంతో పాటుగా.. పార్టీ అభ్యర్ధులుగా పని చేసుకోవటానికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. కానీ, ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి లోకేశ్ యాత్రలో పాల్గొంటారా లేక ఎమ్మెల్యేలుగా ఉంటూనే లోకేశ్ యాత్రకు వెళ్తారా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది.
అనర్హత వేటు సాధ్యమేనా: తమ పార్టీ నుంచి గెలిచి..తమను ధిక్కరించి..ఇప్పుడు టీడీపీకి మద్దతు పలుకుతున్న ఈ ముగ్గురి పైన వైసీపీ నాయకత్వం సీరియస్ గా ఉంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఉపేక్షించే విధంగా వ్యవహరించ కూడదనే భావనతో ఉంది. ఈ క్రమంలో ఈ ముగ్గురి పైన అనర్హత వేటుకు అవసరమైన ఆధారాలు..నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తొమ్మది నెలల సమయం ఉంది. ఈ ముగ్గురిపైనా వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్తారనే వాదన వినిపిస్తోంది. ఈ ముగ్గురు ఉప ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచే అవకాశం లేదనేది వైసీపీ ధీమా. దీని ద్వారా అసెంబ్లీ ఎన్నికల ముందు తమను దెబ్బ తీసిన చోటే టీడీపీకి షాక్ ఇస్తారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..అటు ఎమ్మెల్యేల అడుగుటు..వైసీపీ చర్యలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications