డీఎస్సీ -2025 ఫలితాలు, పోస్టింగ్స్ పై ప్రభుత్వం బిగ్ అప్డేట్..!!
మెగా డీఎస్సీ -2025 రాసిన అభ్యర్ధులకు బిగ్ అప్డేట్. డీఎస్సీ ఫలితాల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన తరువాత నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షలు నిర్వహించింది. కీ విడుదల కావటంతో.. ఇక, ఇప్పుడు ఫలితాల ప్రకటన పైన తుది కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసారు. ఇక, శిక్షణ.. పోస్టింగ్స్ పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.
ఏపీలో మెగా డీఎస్సీ-2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించనుంది. క్రీడల కోటాలో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా శాప్ నుంచి అందలేదు. అవి రాగానే జిల్లాల్లో కటాఫ్ మార్కులు ప్రకటిస్తుంది. ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తిచేస్తారు. నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. కాగా, కొత్తగా వచ్చే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్‌లకు ముందే పూర్తిచేస్తారు.

ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడటంతో నాలుగైదు శని, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబరు మొదటి వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరనున్నారు. వచ్చే నెల నుంచి కొత్తగా నియామకం పొందిన టీచర్లు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కానున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖలో ఇటీవల 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష సెప్టెంబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో పెన్ను, పేపర్ పద్ధతిలో జరగనుంది.
-
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications