వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ బయోటెక్ తో ఆయనకు బంధుత్వం, చంద్రబాబు తెప్పించినా పర్వాలేదు: ఆళ్ళ నాని కౌంటర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని టిడిపి అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ లు తెప్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్న సమయంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు కౌంటర్ వేశారు.

కరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయంకరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం

వ్యాక్సినేషన్ విషయంలో ప్రతిపక్షాలది కావాలని చేసే రాద్ధాంతం

వ్యాక్సినేషన్ విషయంలో ప్రతిపక్షాలది కావాలని చేసే రాద్ధాంతం

భారత్ బయోటెక్ తో ఆయనకున్న బంధుత్వాన్ని ఉపయోగించి,రాష్ట్రానికి చంద్రబాబు వ్యాక్సిన్లను తెప్పించినా తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఆళ్ల నాని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ తో పాటుగా కరోనా సంబంధిత సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘం భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఇదే సమయంలో ఆళ్ల నాని చంద్రబాబును టార్గెట్ చేశారు.

వ్యాక్సిన్ ల విషయంలో చంద్రబాబు అసత్యాలు

వ్యాక్సిన్ ల విషయంలో చంద్రబాబు అసత్యాలు

వ్యాక్సిన్ కొనుగోలు అనేది ప్రభుత్వం చేతిలోనే ఉందని చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ఉచితంగా జరగాలన్నది సీఎం జగన్ అభిమతమని ఆళ్ల నాని పేర్కొన్నారు.1600 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనకాడమని ఆయన స్పష్టం చేశారు.
ఇక కేంద్రం ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చినా పంపిణీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న ఆళ్లనాని, ఒకే రోజులో ఆరు లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఆక్సిజన్ పరిస్థితులపై మంత్రి ఆళ్ళ నానీ వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఆక్సిజన్ పరిస్థితులపై మంత్రి ఆళ్ళ నానీ వ్యాఖ్యలు


కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అధికంగా అవసరం ఉందని పేర్కొన్న ఆళ్లనాని, ఆక్సిజన్ రవాణా పర్యవేక్షణ కోసం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని పేర్కొన్న ఆళ్లనాని, ఇప్పటికే తాము ప్రధానికి లేఖ రాశామని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధం చేస్తున్నామని వివరించారు. మరోవైపు ఆక్సిజన్ వృధా కాకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ఆళ్ల నాని, తిరుపతి రుయా ఆస్పత్రిలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

కరోనా కట్టడికి సీఎం జగన్ మార్గదర్శకాలు

కరోనా కట్టడికి సీఎం జగన్ మార్గదర్శకాలు

రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం జగన్ నిర్ధిష్టమైన మార్గదర్శకాలను సూచించారని, అధికారులు ఆ దిశగా నివారణ చర్యలు చేపట్టారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గ ఉప సంఘం భేటీలో చర్చించినట్లు పేర్కొన్న ఆళ్లనాని ఆసుపత్రులలో బెడ్స్, కోవిడ్ కేర్ సెంటర్స్,ఐసోలేషన్ వార్డులు, ఆక్సిజన్ సమస్య పై తాము చర్చించామని చెప్పారు. రాష్ట్రంలో 20 వేలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుత 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వాడుతున్నామని ఆళ్ల నాని స్పష్టం చేశారు.

English summary
Andhra Pradesh Deputy CM and Medical Health Minister Alla Nani made interesting remarks on TDP chief Chandrababu. While Telugu Desam party leaders have repeatedly criticized the Jagan government for failing to bring corona vaccines to the state, Health Minister Alla Nani has countered TDP chief Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X