Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అడ్డంగా దొరికిపోయిన జనసేన ఎంపీ అభ్యర్థి

ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.ఎన్నికల్లో గెలుపు కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ ఈ సారి కాకినాడ లోక్ సభ ఎన్నికల్లో విమర్శల వేడి మరింత పెరిగింది. కాకినాడ లోక్ సభ కూటమి అభ్యర్థి తంగేల ఉదయ్ శ్రీనివాస్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ధృవ పత్రాలను సమర్పించారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థి తంగేల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. రాజకీయాలలోకి వచ్చే ముందు తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివానని..దుబాయ్‌లో సాఫ్ట్‌ వేర్ ఉద్యోగం చేశానని ప్రచారం చేసుకున్నారు. ఆ తరువాత వాటికి రాజీనామా చేసి దుబాయ్‌లో వ్యాపారం చేశారన్న ప్రచారం సాగింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల అఫిడవిట్ లో తన విద్యా అర్హత ఇంటర్ అని నమోదు చేయడంతో ఇపుడు అసలు వివాదం మొదలైంది.

ఎన్నికల అఫిడవిట్ తన విద్యా అర్హత ఇంటర్ గా పేర్కనడంతో అసలు వివాదం రాజుకొంది. ఇంటర్ చదివిన వ్యక్తికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎలా వస్తుంది. అందులోనూ చట్టాలు కఠినంగా అమలయ్యే దుబాయ్ లో ఇంటర్ విద్యార్హతతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవే అంశాలను తంగెల ఉదయ్ శ్రీనివాస్ రాజకీయ ప్రత్యర్థులు లేవనెత్తుతున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు దుబాయ్ వంటి దేశంలో పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు వంటి చిన్న ఉద్యోగాలే తప్పా పెద్ద ఉన్నత ఉద్యోగాలు అసాధ్యమన్న చర్చ సాగుతోంది. దీంతో ఇంటర్ చదివిన వ్యక్తి కోట్లు ఎలా సంపాధించాడు అన్న లోతైన చర్చ సాగే క్రమంలో ఆయన అక్రమాల పుట్టను రాజకీయ ప్రత్యర్థులు తవ్వితీస్తున్నారు.

allegations against Kakinada Janasena candidate

దీంతో ఒక్కోక్కటిగా ఆయన నేర చరిత్ర వెలుగులోకి వస్తోంది. వాటిని ఓ సారి పరిశీలిస్తే తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఓ మధ్య తరగతి కుటుంభానికి చెందిన వ్యక్తి ఓ ఉన్నత స్థాయికి ఎగిగారన్న ప్రచారమే ఆయన్ని లోక్ సభ అభ్యర్థి టిక్కెట్ దక్కేలా చేసింది. స్వశక్తితో పైకి వచ్చి ప్రజాసేవలో కొనసాగడంతో జనసేన పార్టీ ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చింది. కానీ ఆయన గత చరిత్ర అందుకు భిన్నంగా ఉండటమే ఇపుడు రాజకీయంగా ప్రకంకనలు పుట్టిస్తోంది. ఇంటర్ చదివిన వ్యక్తి దుబాయ్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయడం ఏమిటీ ఆ ఉద్యోగంతోనే కోట్లు సంపాధించడం ఏమిటీ అన్న దానిపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు వాస్తవాలు వెలికితీసే పనిలో పడ్డారు. దీంతో ఆయన అక్రమాల చిట్టా ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తోంది. వాస్తవానికి దుబాయ్ లో తంగెల ఉదయ్ శ్రీనివాస్ సాఫ్ట్ వేర్ జాబ్ చేయలేదని క్రికెట్ బుకీ నిర్వహించేవాడని తెలుస్తోంది.

allegations against Kakinada Janasena candidate

అక్కడి వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన తంగెల ఉదయ్ శ్రీనివాస్ పై దుబాయ్ ప్రభుత్వం 2015 మార్చిలో కేసు నమోదు చేసి, అతని కోసం లుక్ ఔట్ నోటీసు ఇచ్చారన్న దానికి సంబంధించి కేసు వివరాల ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో వాటినుంచి చాకచక్యంగా తప్పించుకొని ఇండియా పారిపోయి వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి తానో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పుకొని దుబాయ్ లోనే తాను కోట్లు సంపాధించానని బిల్డప్ ఇస్తున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

allegations against Kakinada Janasena candidate

వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించిన ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఈ ఎన్నికల ప్రచారంలో వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఉదయ్ శ్రీనివాస్ పైన స్వదేశంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పాన్ కార్డులు తీసుకొని వివిధ కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణ జనసేన అభ్యర్థిపై ఉంది. ఉదయ్ శ్రీనివాస్ భూ కబ్జా కేసు కూడా ఉన్నట్లు ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అక్రమాలు వెలుగులోకి రావడంతో జనసేన అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఇరకాటంలో పడినట్టు అయింది. వైసీపీ పార్టీ ఇదే అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా మల్చుకొని వాటిని ఉదయ్ శ్రీనివాప్ పై ప్రయోగించేందుకు సిద్దమవుతుంది. ఈ ఆరోపణలతో కూటమి విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+