Allu Arjun : పవన్ కు బన్నీ షాక్ - వైసీపీకి మద్దతుగా, ఫ్యాన్స్ ఫైర్..!!
ఏపీలో ఎన్నికల్లో మెగా హీరోలు కీలకంగా మారారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే మెగా హీరోలు పవన్ కు మద్దతు ప్రకటించారు. చిరంజీవి సైతం కూటమి లో కొందరు అభ్యర్దులు..తమ్ముడు పవన్ కు అనుకూలంగా వీడియో సందేశం ఇచ్చారు. మెగా కుటుంబ సభ్యులతో పాటుగా బుల్లి తెర ప్రముఖులు సైతం పిఠాపురంలో మకాం వేసారు. ఈ సమయంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం కొత్త వివాదానికి కారణంగా నిలుస్తోంది.
బన్నీ మార్క్ షాక్
ఎన్నికల ప్రచారం ముగిసే వేళ పవన్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షాక్ ఇచ్చారు. ఏపీలో ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చివరి రోజున పిఠాపురంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పవన్ గెలవాలని ఆకాంక్షించారు.

ట్వీట తో సరి పెట్టారు. కానీ, ఇప్పుడు పవన్ కు షాక్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్ది కోసం నంద్యాల వెళ్లారు. అక్కడ వైసీపీ నుంచి బరిలో ఉన్న శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నిలిచారు. రవి గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యవహారం పొలిటికల్, సినీ సర్కిల్స్ లో చర్చగా మారింది.
నంద్యాలలో సందడి
తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చారు. గజమాలతో శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు ఘనస్వాగతం పలికారు. బన్నీ రేంజ్ రోవర్ కారును పెద్దఎత్తున అభిమానులు చుట్టు ముట్టారు. వేలాది మంది అభిమానుల మధ్య శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి బన్నీ దంపతులు చేరుకున్నారు.
శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటి పైనుంచి అభిమానులకు అభివాదం చేశారు. శిల్పా రవిచంద్రారెడ్డి భార్య నాగిని రెడ్డి, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్. స్నేహారెడ్డిని అల్లు అర్జున్ వివాహం చేసుకున్న తర్వాత.. రవిచంద్రారెడ్డి, బన్నీ మంచి స్నేహితులు అయ్యారు. ఇరు కుటుంబాల్లో జరుగుతున్న శుభకార్యాల్లోనూ వారు పాల్గొన్నారు.
అల్లు అర్జున్ రాకతో జనాలతో కిక్కిరిసిన నంద్యాల..!!#AlluArjun #AlluSnehaReddy #AlluArjunAtNandyal #ShilpaRaviChandraKishoreReddy #ApElections2024 #AndhraPradeshElection2024 #Oneindiatelugu pic.twitter.com/5xnEfUyiBK
— oneindiatelugu (@oneindiatelugu) May 11, 2024
వైసీపీ అభ్యర్ది గెలవాలంటూ
2019 ఎన్నికల్లో తొలిసారి నంద్యాల నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో కూడా బన్నీ తన మిత్రుడు విజయం సాధించాలని మద్దతు తెలిపారు. అయితే, పవన్ కల్యాణ్ అటు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించిన బన్నీ....ఇప్పుడు మిత్రుడు అయిన వైసీపీ అభ్యర్ది కోసం నేరుగా నంద్యాల వెళ్లటం పవన్ ఫ్యాన్స్ ను నచ్చటం లేదు.
పవన్ కు ప్రకటించిన తరహాలోనే తన మిత్రుడుకు ఎందుకు చెప్పలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ కు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ సమయంలో మెగా ఫ్యామిలీలో ప్రముఖ హీరోగా ఉన్న అల్లు అర్జున్ తాజా నంద్యాల పర్యటన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications