పవన్..మా కులంలో భయపడేవారెవరూ లేరు: టీడీపీ అక్రమ వ్యాపార సంస్థ: ఆమంచి సంచలనం..!!
మాజీ ఎమ్మెల్యే..వైసీపీ నేత ఆమంచి ఆమంచి కృష్ణ మోహన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ కాపు నేతలు భయపడుతున్నారన్న పవన్ వ్యాఖ్యలను ఆయన తప్పు బట్టారు. తమ కులంలో భయపడేవారెవరూ లేరని తేల్చి చెప్పారు. ఎవరికైనా సాయం చేసే గుణమే కానీ..భయపడటం తమకు చేతకాదన్నారు. పవన్ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. అదే సమయంలో తోట త్రిమూర్తులు సైతం స్పందించారు. పవన్ కళ్యాణ్ తాను రెల్లి కులంలో పుట్టాలని కోరుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసారు. కాపు నేతలు భయపడేవారు కాదని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఆమంచి కృష్ణ మోహన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కులతత్వాన్ని ఎదుర్కోగలిగిన వ్యక్తం జగన్ అంటూ కీర్తించారు. టీడీపీ అక్రమ వ్యాపార సంస్థ అని..రాజకీయ పార్టీ కాదంటూ మండిపడ్డారు.
పవన్..నీ వ్యాఖ్యలు ఉపసంహరించుకో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ డిమాండ్ చేసారు. తాను పవన్ కులమేనని..తమ కులంలో ఎవరూ భయపడేవారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తాము ఏ సందర్భంలోనూ ఎవరికీ భయపడిన పరిస్థితి లేదని స్పష్టం చేసారు. తాము ఎవరికైనా మంచి చేయాలనే ఆలోచనే చేస్తామని వివరించారు. చంద్రబాబు కుల తత్వాన్ని పెంచి పోషించారని..అటువంటి చంద్రబాబును ఎదుర్కొని సామాజిక న్యాయం ఎదుర్కోగలిగిన వ్యక్తం జగన్ మాత్రమేనని స్పష్టం చేసారు. సిగ్గులేకుండా చంద్రబాబు తన పార్టీ వాళ్ళను బీజేపీలోకి పంపుతున్నారని మండి పడ్డారు. చంద్రబాబు వెనుక ఉన్న వాళ్లు ఉత్తుత్తి నాయకులేనని ఫైర్ అయ్యారు. మేము దేనికి ఆశపడి పార్టీలో చేరలేదని చెప్పుకొచ్చారు.

కాపు నేతలు వైసీపీలోకి రావటానికి సిద్దంగా ఉన్నారు..
అన్ని పార్టీల్లో ఉన్న కాపు నేతలు ముఖ్యమంత్రి జగన్ ఓకే అంటే వెంటనే వైసీపీ లో చేరటానికి సిద్దంగా ఉన్నారని ఆమంచి కృష్ణ మోహన్ వివరించారు. అందులో ఊహించని ప్రముఖులు సైతం ఉన్నారని చెప్పుకొచ్చారు. 1983లో బీసీ లంతా ఏ రకంగా టీడీపీ వైపు నిలిచారో..చంద్రబాబు కులతత్వం కారణంగా వారంతా తాజాగా జరగిన ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీకి మద్దతుగా నిలిచారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం వైసీపీతోనే జరుగుతుందన్నారు. త్వరలోనే కీలక నేతలు వైసీపీలోకి రానున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ రాజకీయ పార్టీ కాదని..అది అక్రమ వ్యాపార సంస్థ అంటూ మండిపడ్డారు. ఇప్పటికే టీడీపీకి ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందని..ఇక టీడీపీకి రాజకీయ మనుగడ లేదని ఆమంచి కృష్ణ మోహన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications