Amaravati: అసెంబ్లీపై స్పెషల్ టవర్- అమరావతి అంతా కనిపించేలా..!

ఏపీ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. అమరావతి రాజధాని నిర్మాణం తర్వాత మొత్తం రాజధానిని ఒకే చోట నుంచి వీక్షించేలా ఓ ప్రత్యేక టవర్ నిర్మాణం చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటున్న సింగపూర్ సంస్ద నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో ప్రభుత్వం (AP govt) చర్చలు జరిపింది. అనంతరం ఈ టవర్, ఇతర నిర్మాణాల వివరాలను మంత్రులు వెల్లడించారు.

గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ కన్ను ? మాజీ వైసీపీ నేతకు ఆఫర్..!
గుంటూరు మేయర్ పీఠంపై బీజేపీ కన్ను ? మాజీ వైసీపీ నేతకు ఆఫర్..!

అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ (Norman Foster + Partners) ప్రతినిధుల బృందంతో రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శాసనసభ భవనానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో పలు అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభ భవనం పైన ప్రత్యేక టవర్‌ను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి అమరావతి రాజధాని మొత్తాన్ని వీక్షించేలా నిర్మాణ రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు.

Amaravati AP Govt Plans Special Tower At New Assembly Building To Overlook Entire Capital
కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?
కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?

భవిష్యత్‌లో నియోజకవర్గాల డీలిమిటేషన్ వల్ల ఏర్పడే మార్పులను దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా భవన డిజైన్లను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 265 శాసనసభ స్థానాలు, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా శాసనసభ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రజలు శాసనసభను సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసన ప్రక్రియపై అవగాహన కలిగేలా, వారికి మంచి అనుభూతిని అందించే విధంగా ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. గవర్నర్ ప్రసంగించే సందర్భాల్లో శాసనసభ, శాసనమండలి ఉభయ సభల సభ్యులందరూ ఒకే చోట కూర్చునేలా సెంట్రల్ హాల్ ఏర్పాటు చేసే విధంగా డిజైన్ రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+