వరల్డ్ క్లాస్ నగరంగా అమరావతి.. చంద్రబాబు దూకుడు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతిని ప్రపంచం గుర్తించే లెవల్ లో తీర్చి దిద్ది ఏపీకి పెట్టుబడులను ఆకర్షించాలనే ప్లాన్ లో ఉన్నారు సీఎం చంద్రబాబు, ఈ క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు వేస్తున్నారు.

చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ
ఈ క్రమంలో తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్ తో కలిసి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

Amaravati as a world class city chandrababu meeting with World Bank representatives

వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల మూడు రోజుల పర్యటన
ఈ బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీవియర్,సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్ షెన్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలిరజాక్ ఎఫ్.ఖలీల్ ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం విజయవాడకు వచ్చిన ప్రపంచ బ్యాంక్ బృందం మధ్యాహ్నం వరకూ విజయవాడ సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.

రాజధాని అమరావతిలో పర్యటించిన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు
సీఆర్డీయే గురించి అమరావతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందానికి వివరించారు. శనివారం మధ్యాహ్నం అమరావతిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నిర్మాణంలో ఉన్న భవనాలను వారు పరిశీలించారు. రెండో రోజు ఆదివారం రాజధానిలోని రోడ్లను, కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్ హౌస్ పనులను పరిశీలించడం తో పాటు విట్, ఎస్ఆర్ఎం, ఎయిమ్స్ లను పరిశీలించారు.

Amaravati as a world class city chandrababu meeting with World Bank representatives

ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి నిర్మాణ వివరాలు చెప్పిన చంద్రబాబు
సోమవారం సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకెళ్తుందనే దానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు సీఎం వివరించారు. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు వారికి వివరించారు.

అమరావతికి అండగా ప్రపంచ బ్యాంకు
చంద్రబాబు తో మాట్లాడిన అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం అమరావతికి అండగా ఉండేందుకు సానుకూలంగా ఉందని సీఆర్డీయే అధికారులు చెప్పారు. మరోమారు ప్రపంచ బ్యాంకు ఉన్నతాధికారుల బృందం మళ్ళీ మన రాష్ట్రానికి వస్తుందని, ఆ తర్వాతే రాబోయే రుణంపై స్పష్టత వస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+