అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారితప్పిన అమరావతి పోరు-జగన్ సర్కార్ విధానాలపై విమర్శలకే పరిమితం-సానుభూతి మాయం

|
Google Oneindia TeluguNews

ఏపీలో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న అమరావతి ఉద్యమం తాజాగా దారి తప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిత్యం అమరావతి జేఏసీ నేతలతో పాటు ఉద్యమంలో పాల్గొంటున్న వారు.. అమరావతి రాజధాని వ్యవహారాన్ని పక్కనబెట్టి జగన్ సర్కార్ విధానాలను విమర్శించేందుకు పోటీ పడుతుండటమే ఇందుకు కారణం. దీంతో రాజధాని కోసం అసలు ఉద్యమం జరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో అమరావతి రాజధానిపై రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రజల్లో ఉన్న కాస్తో కూస్తో సానుభూతి కూడా ఆవిరైనట్లు తెలుస్తోంది.

మూడు రాజధానులతో అమరావతి ఉద్యమం

మూడు రాజధానులతో అమరావతి ఉద్యమం


ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే అప్పటివరకూ రాజధానిగా ఉన్న అమరావతి స్ధానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి మరో రెండు రాజధానులతో కలిపి ముూడో రాజధానిగా మిగిలిపోనుంది. దీంతో అమరావతినే నమ్ముకుని రాజధానికి భూములిచ్చిన రైతులు, స్ధానిక రాజకీయ నేతలు అంతా రోడ్డుపై పడ్డారు. వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున నిరసనలు కూడా చేశారు. రాజధాని గ్రామల్లో దీక్షలు చేపట్టారు.మూడు రాజధానులకు వ్యతిరేకంగా వీరంతా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముందుకు సాగడం లేదు. దీంతో వీరికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.

హైకోర్టులో విచారణ అంతకంతకూ ఆలస్యం

హైకోర్టులో విచారణ అంతకంతకూ ఆలస్యం

మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు,, అమరావతి జేఏసీ, ఇతర స్వచ్ఛంద సంస్ధలు, రాజకీయ పక్షాలతో కలిసి హైకోర్టులో దాదాపు వందకు పైగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ ప్రారంభమై కీలక దశలో ఉండగా.. ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి గతేడాది బదిలీ అయి వెళ్లిపోయారు. ఆ తర్వాత వీరి కష్టాలు రెట్టింపయ్యాయి. కొత్త ఛీఫ్ జస్టిస్ రాగానే మరోసారి విచారణ ప్రారంభం అవుతుందని భావించినా ఇప్పటికీ రెగ్యులర్ విచారణ ప్రారంభం కాలేదు. అదే సమయంలో ప్రారంభమైన విచారణ కూడా రెండు నెలల పాటు వాయిదా పడిపోయింది. దీంతో అమరావతి వాసులంతా ఇక చేసేది లేక నిరాశగా ఎదురుచూస్తున్నారు.

 ఉద్యమానికి రాజకీయాల మకిలి

ఉద్యమానికి రాజకీయాల మకిలి

అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు ప్రారంభమైన ఉద్యమానికి అనతికాలంలోనే రాజకీయాల మకిలి అంటుకుంది. అప్పటికే చంద్రబాబు స్పాన్సర్డ్ ఉద్యమంగా మొదలైన విమర్శలు తీవ్రతరం అయ్యేందుకు ఎంతోకాలం పట్టలేదు. ఉద్యమం ప్రారంభమైన కొత్తలో విపక్ష పార్టీలకు చెందిన వారంతా దీన్ని ఓన్ చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. వీరి చుట్టూ చక్కర్లు కొట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వారంతా మొహం చాటేయడం మొదలుపెట్టేశారు. అయినా వారు ఉద్యమకారులకు అంటించిన మకిలి మాత్రం ఇంకా పోలేదు. దీంతో ఇప్పటికీ ఉద్యమంలో ఉన్న వారు రాజధాని వ్యవహారం కంటే రాజకీయాలు మాట్లాడేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

 గతి తప్పిన ఉద్యమం

గతి తప్పిన ఉద్యమం

ఎప్పుడైతే రాజకీయనాయకులు ఉద్యమంలో ప్రవేశించారో అప్పుడే అమరావతి ఉధ్యమానికి రాజకీయ మకిలి అంటడం ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు, వాటి నేతలు జారుకున్నాక కూడా అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఆ మకిలిని వదిలించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రభుత్వంపై విమర్శలతో ఏదో రకంగా వార్తల్లో నిలవాలన్న తపనే తప్ప అమరావతి రాజధాని గురించి మిగతా ప్రాంతాలకు తెలియచెప్పడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టడం వంటివి మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో ఉద్యమంలో ఉన్నరైతులు, ఇతర ఉద్యమకారులు కూడా ఇప్పుడు అమరావతి కంటే జగన్ సర్కార్ విధానాలనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ కనిపిస్తున్నారు.

Recommended Video

5.1 తీవ్రతతో Earthquake.. AP, Tamil Nadu లోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..! || Oneindia Telugu
ఇతర ప్రాంతాల్లో సానుభూతి మాయం

ఇతర ప్రాంతాల్లో సానుభూతి మాయం


ఎప్పుడైతే అమరావతి ఉద్యమకారులు అసలు విషయం వదిలిపెట్టి జగన్ సర్కార్ విధానాలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారో అప్పుడే ఉద్యమం గతి తప్పింది. అప్పటివరకూ రాజధాని ఉద్యమంపై విపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్ తో పాటు మరికొందరు కాస్తో కూస్తో దృష్టిపెట్టేవారు. అప్పుడప్పుడైనా మాట్లాడేందుకు ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు వారు కూడా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. 500 రోజులు, 600 రోజులు పూర్తయినప్పుడు మాత్రమే వారు మాట్లాడటం కనిపిస్తోంది. దీంతో సహజంగానే ఇతర ప్రాంతాల్లోని ప్రజలు కూడా అమరావతి ఉద్యమంపై శీతకన్ను వహించారు. గతంలో అమరావతికి అన్యాయం జరుగుతుందన్న వాదనపై కాస్తో కూస్తో సానుభూతి ప్రదర్శించిన మిగిలిన ప్రాంతాల వారంతా ఇప్పుడు దానిపై మాట్లాడేందుకే ఆసక్తి చూపడం లేదు. దీంతో అమరావతికి వచ్చిన కాస్తో కూస్తో సానుభూతి కూడా ఆవిరైనట్లయింది.

English summary
sympothy over amaravati capital movement in andhrapradesh slowly evaporating with jac leaders and protesters daily statements on jagan govt's policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X