వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు దళిత రైతుల సెగ-అసైన్డ్ స్కాంలోకి రాగడంపై నిరసనలు
అమరావతిలో తాజాగా వైసీపీ బయటపెట్టిన అసైన్డ్ భూముల వ్యవహారం కాకరేపుతోంది. అసైన్డ్ రైతుల నుంచి బలవంతంగా టీడీపీ నేతలు భూములు లాక్కున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా ఆధారాలు బయటపెట్టడంపై దళిత జేఏసీ నేతలు మండిపడ్డారు. రాజధానిలోన సీడ్ యాక్సిస్ రోడ్డుపై నిరనసలకు దిగారు.
అమరావతి ప్రకటన రాకముందే దళిత రైతుల నుంచి టీడీపీ నేతలు అసైన్డ్ భూములు లాక్కున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తాజాగా ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి రైతులతో రియల్టర్లు మాట్లాడుతున్నా వీడియోలను ఆయన బయటపెట్టారు. దీనిపై అమరావతి దళిత జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసైన్డ్ భూముల్ని అమ్ముకున్నారని చెప్తున్న రైతులెవరైనా ఎమ్మెల్యే ఆర్కేన కలిసి ఫిర్యాదు చేశారా అని జేఏసీ నేతలు ఆయన్ను ప్రశ్నించారు.

రెండేళ్లుగా అమరావతి రైతులకు ప్రభుత్వం కౌలు డబ్బులు సకాలంలో ఇవ్వనప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారని దళిత జేఏసీ నేతలు ప్రశ్నించారు. ఇక్కడ ఎవరికీ అన్యాయం జరగలేదని, మేం మా భూములు స్వచ్చందంగానే అమ్ముకున్నామని, పిల్లల పెళ్లిళ్లు చేసుకున్నామని నేతలు తెలిపారు. అసైన్డ్ భూముల రైతులు తిరిగి వారికిస్తామని, వ్యవసాయం చేసుకుంటారని ఆర్కే చెప్పడం దారుణమని నేతలు విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్కే రాజధానిలో చేస్తున్న అక్రమాలన్నీ త్వరలో బయటపెడతామన్నారు.