అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ శతాబ్ధపు నగరంగా అమరావతి:బాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: 21వ శతాబ్ద నగరంగా అమరావతిని నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కేవలం పరిపాలన అవసరాల కోసం కాకుండా ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు జరిగే గతిశీల నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. జూన్‌ 6వ తేదీన భూమిపూజ, దసరానాడు శంకుస్థాపన చేసి సాధ్యమైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పాన్ని ప్రకటించారు.

సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక అందించారు. బృహత్‌ ప్రణాళికను సుర్బానా, జురాంగ్‌ కన్సల్టెన్సీలు, సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌, సింగపూర్‌ పరిశ్రమల మంత్రిత్వశాఖ రూపొందించాయి. ఈ సందర్భంగా సింగపూర్‌ మంత్రితో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. 'అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మించాలనుకుంటున్నాం. ఈ క్రమంలో తాత్కాలిక ఇబ్బందులున్నా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమంగా తయారవుతుంది. రాజధాని లేక మనం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితులను అధిగమించేందుకు చేస్తున్న శ్రమంతా భావితరాల కోసమే'నని అన్నారు.

ప్రపంచంలో ఆర్థిక వ్యవహారాలు, సామాజిక కార్యక్రమాలున్న రాజధానులే ఉపాధి కల్పన కేంద్రాలుగా ఎదిగాయన్నారు. మనం కూడా అలా అమరావతిని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రధాన రాజధాని ప్రాంత బృహత్‌ ప్రణాళిక (సీడ్‌కేపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌) జులై 15లోపు అందిస్తారని చెప్పారు. అక్కడినుంచి అన్ని ప్రణాళికలు, లాంఛనాలు పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

21వ శతాబ్ద నగరంగా అమరావతిని నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేవలం పరిపాలన అవసరాల కోసం కాకుండా ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు జరిగే గతిశీల నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

జూన్‌ 6వ తేదీన భూమిపూజ, దసరానాడు శంకుస్థాపన చేసి సాధ్యమైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పాన్ని ప్రకటించారు.

చంద్రబాబు

చంద్రబాబు

సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక అందించారు.

చంద్రబాబు

చంద్రబాబు

బృహత్‌ ప్రణాళికను సుర్బానా, జురాంగ్‌ కన్సల్టెన్సీలు, సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌, సింగపూర్‌ పరిశ్రమల మంత్రిత్వశాఖ రూపొందించాయి. ఈ సందర్భంగా సింగపూర్‌ మంత్రితో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

'అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మించాలనుకుంటున్నాం. ఈ క్రమంలో తాత్కాలిక ఇబ్బందులున్నా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమంగా యారవుతుంది. రాజధాని లేక మనం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితులను అధిగమించేందుకు చేస్తున్న శ్రమంతా భావితరాల కోసమే'నని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రపంచంలో ఆర్థిక వ్యవహారాలు, సామాజిక కార్యక్రమాలున్న రాజధానులే ఉపాధి కల్పన కేంద్రాలుగా ఎదిగాయన్నారు. మనం కూడా అలా అమరావతిని అభివృద్ధి చేసుకోవాలన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రధాన రాజధాని ప్రాంత బృహత్‌ ప్రణాళిక (సీడ్‌కేపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌) జులై 15లోపు అందిస్తారని చెప్పారు. అక్కడినుంచి అన్ని ప్రణాళికలు, లాంఛనాలు పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రధాన మంత్రి, సింగపూర్‌తో కూడా చర్చించి వారినీ.. కలసివచ్చే అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. రాష్ట్రంలోని వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే లక్ష్యమన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

33వేల ఎకరాల భూములిచ్చిన రైతులందర్నీ అభినందిస్తున్నానని తెలిపారు. ఉదారంగా భూమిచ్చిన వారికి లాభం చేకూర్చాల్సి ఉందన్నారు. వారికి భూమి ఎక్కడ ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

నగర అందాన్ని సమతౌల్యం చేస్తూ వారికి వాణిజ్య, గృహావసర స్థలాలు అందిస్తామన్నారు. సహకరించిన రైతు కూలీలకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

సింగపూర్‌ అందించిన ప్రణాళిక బాగుందని, మనం అనుకున్న వాటన్నింటినీ పొందుపరిచార్చారని చెప్పారు.

మచిలీపట్నంతోపాటు, వాన్‌పిక్‌నూ ఇందులో కలపాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. బృహత్‌ ప్రణాళికకు విలువను జోడించే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. 1.2 కోట్ల మంది జనాభాకు తగ్గట్టు ప్రణాళిక తయారుచేశామన్నారు. రెండు నౌకాశ్రయ ఆధారిత నగరాలతోపాటు అంతర్గత జలరవాణాను అనుసంధానిస్తాంమన్నారు.

వనరులన్నింటినీ ఉపయోగించుకోగలిగితే ప్రపంచంలో అద్భుత నగరంగా గుర్తింపు పొందుతుందని, దీనికి ప్రపంచ అత్యుత్తమ సలహాదారుల సేవలు ఉపయోగించుకుంటామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత ఉందని, దానిపై కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు.

‘కొంతమంది ప్రత్యేకహోదాను అడుగుతున్నారు. అది రావాలని నేనూ కోరుకుంటున్నా. రాజధాని నిర్మాణానికి వేల కోట్లు అవసరమైనందున కేంద్రం నుంచి ఎక్కువ మద్దతు ఆశిస్తున్నాం' అని తెలిపారు.

రాజధానిని జీవితకాలంలో ఒకేసారి నిర్మించుకుంటామని, అందుబాటులోని అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటామన్నారు. ‘మాకు వ్యక్తిగత విశ్వసనీయత ఉన్నందునే సింగపూర్‌ ప్రభుత్వం బృహత్‌ ప్రణాళిక ఉచితంగా ఇచ్చింది. స్విస్‌ఛాలెంజ్‌ కింద పనులు చేస్తూ ముందుకెళ్లాలనుకుంటున్నాం' అని చంద్రబాబు తెలిపారు.

English summary
Singapore companies are keen to take up the developer role for Andhra Pradesh's greenfield capital city, coming up on an area of over 270 sq km on Krishna river bank, said Singapore's Second minister for Trade & Industry, S Iswaran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X