Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ తప్పు చేస్తున్నారా ? అమరావతి పాదయాత్రను అడ్డుకుంటే-రాజకీయంగా నష్టమెవరికి ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన మూడు రాజధానుల ప్రక్రియ ఓవైపు కోర్టుల్లో ఉంది. అదే సమయంలో అమరావతి రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాదాపు రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా ఇదే క్రమంలో న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో అమరావతి మహా పాదయాత్రకు బయలుదేరారు. ఇప్పుడు ఈ యాత్ర గుంటూరు జిల్లాను దాటి ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. అయితే దీనికి పోలీసులు రోజుకో అడ్డంకి కల్పిస్తున్నారు. దీంతో ఇది అంతిమంగా వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగిస్తుందా అన్న చర్చ సాగుతోంది.

అమరావతి పాదయాత్ర

అమరావతి పాదయాత్ర


అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రోడ్డెక్కారు. న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో అమరావతి మహా పాదయాత్ర ప్రారంభించారు. తాజాగా ప్రారంభమైన ఈ యాత్ర గుంటూరు జిల్లాను దాటి ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. అమరావతిలోని నేలపాడు, తుళ్లూరు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర వచ్చే నెల 19న తిరుమల చేరబోతోంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన రోజు తిరుమలలో ఈ యాత్ర ముగించేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో పాదయాత్రకు పోలీసులు కలిగిస్తున్న అడ్డంకులు చర్చనీయాంశమవుతున్నాయి.

 పోలీసుల అడ్డంకులతో ఉధృతం

పోలీసుల అడ్డంకులతో ఉధృతం

అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆదేశాలతో చేస్తున్నారా, లేక స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు కానీ.. పాదయాత్రలో ఎక్కువ జనం ఉంటే చాలు పోలీసులు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే పాదయాత్రలో రైతులు మినహా మరెవరూ ఉండొద్దనే ఆంక్షలు కూడా పెడుతున్నారు. దీంతో ఇప్పుడు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు కూడా ఎవరూ అక్కడికి వెళ్లలేని పరిస్ధితి. ఇలా ఎవరినీ పాదయాత్ర వద్దకు రానీయకుండా దీన్ని కొనసాగిస్తే అంత ఎక్కువగా ప్రచారం జరగదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లాఠీఛార్జ్ పై దుమారం

లాఠీఛార్జ్ పై దుమారం

ఇవాళ అమరావతి రైతుల పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పలువురు గాయపడ్డారు. ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు... అనుమతి లేనిదే పాదయాత్ర వద్దకు వెళ్లకూడదని, కలిసి నడవకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఇలా సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన వారిపై లాఠీఛార్జ్ చేయడం ఎంత వరకూ సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సహజంగా గతంలో జరిగిన అన్ని పాదయాత్రల్లోనూ సంఘీభావం తెలిపేందుకు స్ధానికులు రావడం సహజమే అయినా... ఇక్కడ మాత్రం ఆంక్షలు పెడుతున్నారు. దీని వెనుక వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అడ్డంకులతో ఎవరికి నష్టం ?

అడ్డంకులతో ఎవరికి నష్టం ?

అమరావతి రైతుల పాదయాత్రే కాదు ఏ పాదయాత్ర అయినా చేసే వారికి స్ధానికంగా మద్దతు లభించడం అనేది సర్వసాధారణమే. గతంలోనూ పలు పాదయాత్రల సందర్భంగా పాదయాత్రలు చేసే వారికి పొరుగు ప్రాంతాల నుంచి వచ్చి కూడా సంఘీభావం తెలిపిన ఘటనలు కోకొల్లలు. కానీ అలా పాదయాత్రలు చేసే వారికి సంఘీభావం తెలపకుండా ఎవరినీ అడ్డుకున్న సందర్భాలు మనకు కనిపించవు. కానీ ప్రస్తుతం వైసీపీ సర్కార్ ఆదేశాలతో పోలీసులు మాత్రం పాదయాత్రకు అడ్డంకులు కల్పించడమే కాకుండా అక్కడికి వెళ్లి సంఘీభావం ప్రకటించే వారిని సైతం అడ్డుకుంటున్నారు. ఇవాళ లాఠీఛార్జ్ కూడా చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇలా పాదయాత్రల్ని అడ్డుకుంటే రాజకీయంగా అధికార పార్టీలకే నష్టం జరగడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం అమరావతి పాదయాత్రకు పెరుగుతున్న ప్రజాదరణతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+