'ఎందుకు పెంచాలని కోరుతున్నారంటే.. అదీ బాబు, యనమల ఆలోచన'
ఎఫ్ఆర్బీఎం పరిమితి పెరిగితే మరిన్ని అప్పులు తెచ్చి, కమీషన్లు నొక్కేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి యనమల ఆలోచన అని వైసిపి నేత అంబటి రాంబాబు గురువారం అన్నారు.
అమరావతి: ఎఫ్ఆర్బీఎం పరిమితి పెరిగితే మరిన్ని అప్పులు తెచ్చి, కమీషన్లు నొక్కేయాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆలోచన అని వైసిపి నేత అంబటి రాంబాబు గురువారం అన్నారు.
మా కొడుకు లోకేష్ నా భార్య మాటే వింటాడు: ఎందుకో చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం కమీషన్ల కోసమే ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని కోరుతోందని ఆరోపించారు. పరిమితి పెరిగితే అప్పులు తెచ్చి, నొక్కేద్దామని చూస్తున్నారన్నారు. అందుకే అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంపర్లాడుతోందన్నారు.

కేంద్రంలో ఇరవై శాతం రెవెన్యూ పెరిగితే జీడీపీ 7.2 శాతం ఉందన్నారు. ఏపీలో రెవెన్యూ పెరగకపోయినా 12.23 శాతం ఉన్నట్లుగా అబద్దాలు చెబుతున్నారన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలన్న డిమాండును తాము వ్యతిరేకిస్తున్నాన్నారు. పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును చేర్చి, తన వల్లే వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications