అన్నీ నేనే చేశానంటారు, చంద్రబాబు సైకో కాదా: అంబటి (ఫోటోలు)
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసిన వ్యాఖ్యలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. అసందర్భ ప్రేలాపనలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే సైకో లక్షణాలున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

శుక్రవారం శాసనసభ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ అధికార పార్టీ సభ్యులు వ్యక్తిగత దూషణకు దిగారని, అసలు సైకో లక్షణాలు ఎక్కువగా చంద్రబాబుకే ఉన్నాయని ఆయన అన్నారు. ఓటుకు నోటుకు వ్యవహారంపై శాసనసభలో చర్చకు అనుమతించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.













Click it and Unblock the Notifications