Ambati Rambabu: ఆయన సంబరాల రాంబాబు మాత్రమే కాదు సంచలనాల రాంబాబు కూడా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీ తమ కూటమి నుంచి పోటీ చేసే పలువురు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటన చేయగా వైసిపి ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ కి వచ్చింది.
నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలను ప్రకటించిన వైసిపి ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంది. ఎన్నికల బరిలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు, ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వైసిపి తరఫున ఎన్నికల ప్రచార పర్వాన్ని ఇప్పటికే సాగిస్తున్న నాయకులు వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలోకి తీసుకు వెళుతూ ప్రచారం చేస్తున్నారు.

ఇక ప్రచార పర్వం లోను అప్పుడే ఒక విభిన్నమైన శైలికి తెర తీస్తున్న నాయకులు కూడా లేకపోలేదు. సంక్రాంతి సమయంలో అదిరిపోయే స్టెప్పులతో సంబరాలు జరుపుకునే ఏపీ మంత్రి అంబటి రాంబాబు తాను సంక్రాంతి సమయంలో సంబరాల రాంబాబు నేనని చెప్పిన విషయం తెలిసిందే. ఒక్క సంబరాలలోనే కాదు.. సంచలనాలలోను అంబటి రాంబాబు పెట్టింది పేరు.
ప్రతిపక్ష పార్టీల పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినా, అనేక అంశాల పైన విభిన్నంగా స్పందించినా ఆయన రూటే సపరేటు అని ఏపీ వాసులు అంటుంటారు. అటువంటి మంత్రి అంబటి రాంబాబు ఇటీవల బుల్లెట్ బండి పైన హల్చల్ చేసిన విషయం తెలిసిందే. బుల్లెట్ బండిపైన సత్తెనపల్లిలో తిరిగిన అంబటి రాంబాబు, సత్తెనపల్లిలోని ప్రజలను పలకరించారు.
సత్తెనపల్లి ప్రచారంలో దోశలు వేసిన మంత్రి అంబటి రాంబాబు..!! pic.twitter.com/COKfP9C1I0
— oneindiatelugu (@oneindiatelugu) February 28, 2024
ఇక తాజాగా నేడు ఉదయం సడన్‌గా సత్తెనపల్లిలోని ఓ టీ పాయింట్‌లో మంత్రి అంబటి రాంబాబు దర్శనమిచ్చారు. ఆ టీ దుకాణానికి వచ్చిన వారికి ఆయనే స్వయంగా టీ పెట్టి ఇవ్వడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం వారితో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications