వంగినా..సాష్టాంగ నమస్కారం చేసినా: పాపం పరిష్కారం..మోదీ కోసం: చంద్రబాబుపై అంబటి ఫైర్..!
వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి పర్యటన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు.. చంద్రబాబు విమర్శలను ఆయన తప్పు బట్టారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో హల్ చల్ చేయటానికి ప్రయత్నించారని ఆరోపించారు. విషయం ఉన్నా లేకపోయినా ఏదో గందరగోళం అలజడి సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. ఛలో ఆత్మకూరు..ఇసుక దీక్ష విషయంలోనూ డ్రామాలు చేసారని గుర్తు చేసారు. అమరావతి పై కూడా అలా చేయడానికి అవసరం ఏమున్నదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేసారంటూ ఎద్దేవా చేసారు. మోదీ కోసం చేసారా అని ప్రశ్నించారు.

అక్రమాలపై నివేదిక రాగానే చర్యలు..
అమరావతిలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి.వందలకోట్లు దోచుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పామనే విషయాన్ని అంబటి గుర్తు చేసారు. తాము చేసిన ఆరోపణలకు అనుగుణంగా అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ వేసామని.. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసలు మేం ఏం చేశాం... అమరావతిలో నీవు ఏం చేశావు...అమరావతిని పెంచిపోషించావా..ఏముంది అమరావతిలో..అంటూ ప్రశ్నించారు. అన్ని తాత్కాలికంగా ఎందుకు నిర్మించారు...శాశ్వత భవనాల జోలికి ఎందుకు వెళ్లలేదు...తొందరేమి వచ్చిందిని నిలదీసారు. ఎందుకు పారిపోయివచ్చావు.ఎందుకు వచ్చావో అందిరికి తెలుసు ఓటు కు నోటు కేసు...వస్తే వచ్చావంటూ మండిపడ్డారు.

అమరావతిపై స్పష్టత ఉంది....
అమరావతిని ఎలా నిర్మించాలో, ఏం చేయలనేది తమకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు .తమ నిపుణుల కమిటి పరిశీలన చేస్తోందని...నీవు చేసిన అన్యాయాలు, అక్రమాలు బయటకు తీసే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఎస్సీల అసైన్డ్ భూములు ఉంటే మీ వాళ్లతో కొనిపించి వాళ్లకు స్దలాలు కేటాయించిన వైనం అందరికి తెలుసంటూ ఆరోపించారు. చంద్రబాబు నిన్న లాఠీ చూపించి దీనిని మాపై విసిరారు అని చెబుతున్నారు.దీనికి గౌతం సవాంగ్ సమాధానం చెప్పాలి అంటున్నారు. లాఠీ ఒక్కటే వేశారా మీపైన.చెప్పు కూడా వేశారే.రాయి విసిరారని విన్నాం.చెప్పు చూపి బాటా కంపెని సమాధానం చెప్పాలి..రాయి ఎవరిది..దానికి సమాధానం చెప్పాలి అంటే ఏమిటి అర్దం కావటం లేదని ఎద్దేవా చేసారు. రాజధాని అద్భుతంగా నిర్మించామని చెబుతున్నారని..అదే చోట మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఎందుకు ఓడించారో మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదా అని నిలదీసారు.

పాపం పరిష్కారం కోసమే సాష్టాంగ నమస్కారాలా..
చంద్రబాబు చేసిన పాపాలన్నీ పరిష్కారం అవ్వాలని సాష్టాంగ నమస్కారం చేసారా..లేదా మోదిగారిపై ప్రేమ ఉండి పెట్టారా..0 అమరావతిపై దోచుకున్నానని ప్రేమతో పెట్టారా.. ఎప్పుడూ అలా పెట్టలేదు. పార్లమెంట్ లో సైతం వంగిమాత్రమే దండం పెట్టారంటూ ఎద్దేవా చేసారు. ఇప్పుడు మాత్రం సాష్టాంగం పెట్టారు.డైరక్టర్ ఎవరో గాని బాగానే డైరక్షన్ ఇచ్చినట్లు ఉన్నారుని సెటైర్ వేసారు. చంద్రబాబు వంగినా..సాష్టాంగ నమస్కారం పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు చంద్రబాబును నమ్మరని తేల్చారు కేంద్రానికి రిపోర్ట్ చేసుకోమనండి ఎవరు వద్దన్నారంటూ రాంబాబు వ్యాఖ్యానించారు.మోదికి సాష్టాంగ నమస్కారం పెట్టి మరీ కోరమనండి...రాజధాని నిర్మాణంపై రైతులు భయపడాల్సిన అవసరం లేదుని..ఆ భయం చంద్రబాబు బినామికే ఉంటుందని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications