వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జలవనరులశాఖా మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు.. తొలినాడే పోలవరం విషయంలో టీడీపీపై ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొత్తగా మంత్రులుగా జగన్ కేబినెట్ లో స్థానం దక్కించుకున్న వారు ఒక్కొక్కరుగా మంత్రి బాధ్యతలను చేపడుతున్నారు. గురువారం నాడు జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని 4 బ్లాక్ లో తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి నాడే తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేశారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాడే.. చంద్రబాబును టార్గెట్ చేసిన అంబటి రాంబాబు

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాడే.. చంద్రబాబును టార్గెట్ చేసిన అంబటి రాంబాబు

పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు తప్పిదాల వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని, చంద్రబాబు ధన దాహం వల్ల, పోలవరాన్ని డబ్బు కోసం ఉపయోగించడం వల్ల ప్రస్తుత పరిస్థితి నెలకొందని మంత్రి అంబటి రాంబాబు మంత్రిగా పగ్గాలు చేపట్టిన మొదటిరోజే టిడిపిని టార్గెట్ చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన దివంగత వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన జలయజ్ఞాన్ని తాను పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు. మంత్రిగా అవకాశం ఇవ్వడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

పోలవరం అడ్డంకులను అధిగమిస్తాం .. ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం

పోలవరం అడ్డంకులను అధిగమిస్తాం .. ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందించడం కోసం కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటానని, తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం వరం అని, చాలా కీలకమైన ఈ ప్రాజెక్టు వల్ల రైతులందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు అంబటి రాంబాబు. త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తానని వెల్లడించారు. పోలవరం పై అడ్డంకులను అధిగమిస్తామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

గత ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బ తింది

గత ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బ తింది


పోలవరం రీ డిజైనింగ్ చేయడానికి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని ప్రశ్నించిన అంబటి రాంబాబు గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపారు. గతంలో ఏ ప్రాజెక్టులకు డయాఫ్రం దెబ్బతిన్న సందర్భాలు లేవని, కానీ పోలవరం ప్రాజెక్టు లో డయాఫ్రం వాల్ దెబ్బ తినటానికి గత ప్రభుత్వ తప్పిదాలే కారణమని అంబటి రాంబాబు విమర్శించారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడానికి 2100కోట్ల రూపాయల అంచనా అవుతుందని నిపుణులు చెబుతున్నారు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

డబ్బు కోసం పోలవరాన్ని ఉపయోగించడం వల్లే ఈ దుస్థితి

డబ్బు కోసం పోలవరాన్ని ఉపయోగించడం వల్లే ఈ దుస్థితి

స్పిల్ వే పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం హడావుడిగా పూర్తి చేసి బిల్లులు డ్రా చేశారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా చూశారని, డబ్బు కోసం పోలవరాన్ని ఉపయోగించడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన దేవినేని ఉమా, చంద్రబాబులు ప్రస్తుతం పోలవరం దుస్థితికి కారణమని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వీళ్లిద్దరు జాతికి సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

English summary
Ambati Rambabu took charge as the Minister of Irrigation. Ambati Rambabu alleged tdp after taking charge as minister that the Polavaram diaphragm wall was damaged due to Chandrababu's thirst for money .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X