Ambati Rambabu: ఎట్టకేలకు ఇంటికొచ్చిన కారు-పోలీసులపై అంబటి పంచ్ లు..!

తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక తర్వాత జంతుకొవ్వు కలవలేదని తేలడంతో జగన్, వైసీపీ నేతలపై టీడీపీ ఫ్లెక్సీలు పెట్టించింది. వీటిని తొలగించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu)ను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఆయన వారితో పాటు చంద్రబాబుపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అంబటి ఇంటికి వెళ్లి మరీ ఆయన కారుతో పాటు ఇంటినీ టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం పోలీసులు కూల్ గా వచ్చి అంబటిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

అయితే ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన కారును అప్పట్లో సీజ్ చేసిన పోలీసులు.. దాన్ని ఇప్పటివరకూ వారి వద్దే ఉంచుకున్నారు. దీంతో అంబటి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దాడిలో ధ్వంసమైన అంబటి కారును ఎట్టకేలకు ఆయనకు పోలీసులు అప్పగించారు. అయితే దాడిలో ధ్వంసమైన కారును పోలీసులు ఎందుకు ఇన్ని రోజులు తమ వద్ద ఉంచుకున్నారనే దానిపై వివరణ మాత్రం ఇవ్వలేదు. దీనిపై అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు.

Ambati Rambabu s Car Returned By AP Police 50 Days After TDP Attack

తెలుగుదేశం వారు పగలకొట్టిన నా కారును, పోలీసులు సీజ్ చేసి 50 రోజులు అట్టిపెట్టుకుని,కోర్టు ఆదేశంతో నిన్ననే విడుదల చేశారని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కానీ పగలకొట్టిన వారిని మాత్రం ఒక్క రోజు కూడా స్టేషన్ లో పెట్టలేదని అంబటి ఆరోపించారు. ఇదీ బాబు, లోకేష్ పాలన! అని వ్యాఖ్యానించారు. అప్పట్లో అంబటిపై దాడి చేసిన వారికి పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేసి, ఆయన్ను మాత్రం అరెస్టు చేసి రిమాండ్ పై రాజమండ్రి జైలుకు పంపడం విమర్శలకు కారణమైంది. ఇప్పుడు కారు వ్యవహారంలోనూ పోలీసుల పాత్రపై విమర్శలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+