పవన్ కోసం లోకేష్ విషయంలో చంద్రబాబుకు అమిత్ షా హెచ్చరిక?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో ఆయనకు కూటమినేతలు స్వాగతం పలికారనీ, గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారని గుర్తు చేశారు. అందితే జుట్టు అందకుంటే కాళ్లు పట్టుకునే టైపు రాజకీయ నేత చంద్రబాబు అని అంబటి రాంబాబు విమర్శలు చేశారు.

చంద్రబాబుపై అమిత్ షా అసహనం: అంబటి రాంబాబు
ఇక విందు ఇచ్చిన చంద్రబాబును అమిత్ షా మందలించారని, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. లోకేష్ వ్యవహారంపైన విందు సందర్భంగా అమిత్ షా మండిపడ్డారన్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి కోసం చంద్రబాబు అమిత్ షా ను ప్రాధేయపడ్డారని అయితే లోకేష్ వసూళ్లతో ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అమిత్ షా మండిపడ్డారని పేర్కొన్నారు.

Amit Shah warning to Chandrababu Naidu regarding Lokesh for Pawan kalyan ambati rambabu

లోకేష్ విషయంలో అమిత్ షా అలా చెప్పారు
లోకేష్ ను అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబుకు హితవు చెప్పారన్నారు. అయితే అసలు చంద్రబాబుతో అమిత్ షా మాట్లాడింది బయటకు రాకుండా చంద్రబాబు అసత్యాల ప్రచారం చేస్తున్నారని జగన్ నివాసాల పైన చర్చ జరిగిందని, ఎల్లో మీడియాలో కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా తో రాష్ట్ర పెండింగ్ సమస్యలను చర్చించలేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు భజన చేయటానికే పవన్ పరిమితం
కృష్ణ జలాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం అంశాలు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు క్విడ్ ప్రో కో కింద కాజేసిన ఇంటికి అమిత్ షా ని తీసుకువెళ్లారని అది అక్రమ కట్టడం అని షా కు చంద్రబాబు ఎందుకు చెప్పలేదు అంటూ నిలదీశారు. చంద్రబాబుకు భజన చేయడానికి పవన్ పరిమితం అయ్యారని పవన్ కళ్యాణ్ ను సైతం టార్గెట్ చేశారు.

కొడుకు కోసం చంద్రబాబు విందు రాజకీయాలు
చంద్రబాబు హయాంలోనే మ్యాన్ మేడ్ ఆక్సిడెంట్లు జరిగాయని అంబటి రాంబాబు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే చంద్రబాబు అంగీకరించాడని ఇప్పుడు తన కుమారుడికి కూడా డిప్యూటీ సీఎం కావాలని అమిత్ షాకు విందు ఏర్పాటు చేసి మరీ తన మనసులోని కోరికను ఆయన ముందు వ్యక్తం చేశాడని అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+