దుమ్ము రేపుతున్న అనకాపల్లి ఉత్సవం.. మొదలైన సంబరం!
అనకాపల్లి ఉత్సవ్.. ఏపీ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవం. ఈ ఉత్సవాన్ని అచ్చుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, పార్లమెంట్ సభ్యులు సి.ఎం. రమేష్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించి, ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో-విజువల్ పాటను ఆవిష్కరించారు.
పర్యాటకులను ఆకట్టుకుంటున్న బోట్ షికార్
అనకాపల్లి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా కొండకర్ల ఆవలో ఏర్పాటు చేసిన బోటు షికారు పర్యాటకులను ఆకట్టుకుంది. బొమ్మల వేషాలు, తప్పెటగుళ్లు, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ అనకాపల్లి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సృజనాత్మక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల తయారీ, చెక్కతో కళాఖండాల తయారీ, సవర పెయింటింగ్, వాటర్ కలర్స్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ ఆకట్టుకుంటున్నాయి.

మూడురోజుల అనకాపల్లి ఉత్సవ్
ఫోటోగ్రఫీ, కుండలపై బొమ్మలు వేయుట, మత్స్యకార వస్తువుల తయారీ, మట్టి బొమ్మలు, కుండల తయారీ, సంప్రదాయ పెయింటింగ్ వంటి అంశాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ్ ను ఏపీ సర్కార్ అత్యంత ఘనంగా నిర్వహించనుంది.
అనకాపల్లి ఫేమస్ వస్తువుల స్టాల్స్: ఉత్సవాన్ని ప్రారంభించిన శాసనసభ స్పీకర్
అలాగే జిల్లాలోని స్థానిక ఉత్పత్తులైన మాడుగుల హల్వా, అరకు కాఫీ, గిరిజన ఉత్పత్తులు, స్థానిక సంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లు పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.ఇక రెండురోజుల పాటు సాగే ఈ ఉత్సవాన్ని ప్రారంభించిన శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కొండకర్ల ఆవ దేశంలోనే రెండవ అతిపెద్ద సహజ సిద్ధ సరస్సు అని పేర్కొన్నారు.
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా కొండకర్ల అభివృద్ధి
జిల్లాలోని రిజర్వాయర్లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా కొండకర్లను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.పర్యాటకం వృద్ధి చెందితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని శాసన సభ స్పీకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు కుటుంబంతో గడపాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో తొలిసారి అనకాపల్లి ఉత్సవాలు: మంత్రి కొల్లు రవీంద్ర
జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా అనకాపల్లి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాలకు పర్యాటక గుర్తుంపు వచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
విశాఖ ఉత్సవాలతో పాటు అనకాపల్లి, అరకు ఉత్సవాలు
విశాఖ ఉత్సవాలతో పాటు అనకాపల్లి, అరకు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అనకాపల్లి జిల్లాలో టూరిజం అభివృద్ధికి అనేక వనరులు, ఆలయాలు, పురాతన కట్టడాలు ఉన్నాయన్నారు. కొండకర్లను విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. పర్యాటక అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications