ముహూర్తం కుదిరింది!: త్వరలో వైసీపీలోకి ఆనం, జగన్ హామీ ఎవరికి?
నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీన ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. విశాఖపట్నంలో పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది. ఈ సమయంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారట.

జగన్ విశాఖ పర్యటనలో చేరే అవకాశం
షెడ్యూల్ ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ పర్యటన ఈ నెల పదమూడో తేదిన విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే వేదికపై ఆనం వైసీపీలో చేరాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ మేరకు తన అనుచరుల నుంచి సమాచారం సేకరించి, జగన్ వైపు వెళ్లాలని నిర్ణయించారని అంటున్నారు.

అక్కడే ట్విస్ట్
రెండు రోజుల క్రితం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి జగన్‌ను కలిశారు. ఆయన కూడా త్వరలో పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ఆయన ఆగస్టు నెలలో వైసీపీలో చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతతో భేటీ నేపథ్యంలో ఆయన కూడా పార్టీలోకి వస్తున్నట్లుగా భావిస్తున్నారు. అయితే ఇటు ఆనం, అటు రామ్ కుమార్ రెడ్డిలు వెంకటగిరి టిక్కెట్‌ను ఆశిస్తున్నారు.
Recommended Video


అసలు జగన్ ఎవరికి హామీ ఇచ్చారు?
వెంకటగిరి నియోజవకర్గం టిక్కెట్ ఆశిస్తున్న ఇరువురు నేతలు పార్టీలోకి వస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో జగన్ ఎవరికి హామీ ఇచ్చారనే చర్చ సాగుతోంది. ముందే ఆనంకు మాట ఇచ్చారని చెబుతున్నారు. ఆనంకు వెంకటగిరి స్థానం కేటాయిస్తే రామ్ కుమార్ రెడ్డికి మరోచోటు నుంచి పోటీ చేస్తారా అనే చర్చ సాగుతోంది.

వెంకటగిరిపై ఎవరికి వారే
తాను వెంకటగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని కొద్ది నెలల క్రితం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్పారు. అలాగే, వెంకటగిరి టిక్కెట్ హామీ కోసమే ఆనం ఇన్నాళ్లు వేచి చూశారని, హామీ వచ్చినందునే వైసీపీలోకి వస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications