జగన్‌కు హ్యాండ్!: ఆనం రామనారాయణ యూటర్న్, చక్రం తిప్పిన మంత్రులు
నెల్లూరు: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత ఆనం రామనారాయణ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆశలను నీరుగారుస్తూ ఆయన టీడీపీలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన వైసీపీలో చేరుతారని, 2019 ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం విషయంలోనే వైసీపీతో ప్రతిష్టంభన నెలకొందని, అది మినహా వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది.

కానీ ఇప్పుడు ఆనం యూటర్న్ తీసుకున్నారు. వైసీపీలోకి వెళ్లే ఆలోచనను విరమించుకున్నారు. ఇందుకోసం మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. టీడీపీలో కొనసాగేందుకు అంగీకరించారు.
టీడీపీ స్థానిక నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. మే 14న అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. మే 19న ఆత్మకూరులో మినీమహానాడు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications