తిరుమల శ్రీవారి అర్చన సేవలో.. కాబోయే దంపతులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్

ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న అనంత్ అంబానీ మరియు రాధికా మర్చంట్ నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పట్టువస్త్రాలు, తీర్ధ ప్రసాదాలు అందించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు.. వీవీఐపీ దర్శనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నేడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. తనకు కాబోయే సతీమణి రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లకు స్వాగతం పలికి, వారి దర్శనానికి కావలసిన ఏర్పాట్లను చేశారు.

ఉదయం విఐపి బ్రేక్ దర్శనం సమయంలో వీరు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అధికారులు వారిని పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వసంత పంచమి నాడు స్వామివారిని దర్శించుకున్న కాబోయే దంపతులిద్దరూ తిరుమలలో నేడు స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

Anant Ambani and Radhika Merchant, the engaged couple worshipped Tirumala venkateswara swamy

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లకు ఇటీవల అంగరంగ వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులందరూ ఆడి పాడి సంతోషంగా గడిపారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ ఇంటికి రాబోతున్న కొత్త కోడలిని నిశ్చితార్థ వేడుక ద్వారా సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. ఈసారి నిశ్చితార్ధ వేడుకలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు. ఇక నిశ్చితార్థం కావడంతో పెళ్లికి ముందు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించడానికి బయలుదేరారు. ఇందులో భాగంగా అస్సాంలోని కామాఖ్య శక్తి పీఠాన్ని దర్శించారు. పూరి లోని జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఇదే క్రమంలో ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+