రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌ను వదిలి తప్పు చేశా: జెసి సంచలనం
గుత్తి: రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వదిలి తప్పు చేశానని అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి అన్నారు. గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మార్కెట్ యార్డు ఛైర్మెన్‌తో పాటు ఇక్కడున్నవారంతా ఒకే పార్టీలో సుదీర్ఘంగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. అయితే తాను మాత్రం వలసపక్షినని జెసి వ్యాఖ్యానించారు.

తనకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కిరీటం ఏమీ పెట్టలేదన్నారు జెసి.2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే 2019 నాటికి పోలవరం ప్రాజక్టు పూర్తయ్యే అవకాశం లేదని జెసి అభిప్రాయపడ్డారు.అయితే మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి కానుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు పాలన బాగా ఉందన్నారు. కానీ, కొందరు బాబు పాలన బాగా లేదని చెప్పడాన్ని ఆయన తప్పుబటటారు. రుణమాఫీ కానీ రైతులకు వారం రోజుల్లో రుణాలను మాఫీ చేయిస్తానని ఆయన చెప్పారు.ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకోదన్నారు జెసి దివాకర్ రెడ్డి












Click it and Unblock the Notifications